Pippa: Rajani VS Mrunal

రజనీకాంత్ ను వెనక్కి నెట్టిన మృణాల్ ఠాకూర్

రజనీకాంత్ ను వెనక్కి నెట్టిన మృణాల్ ఠాకూర్

Pippa : ఇషాన్‌ ఖట్టర్‌, మృణాల్‌ ఠాకూర్‌, ప్రియాంన్షు పైనూలి, సోనీ రజ్దానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పిప్పా(Pippa). రాజా కృష్ణమేనన్ దర్శకత్వంలో రోన్ని స్క్రూవాలా, సిద్ధార్థ్‌రాయ్‌కపూర్‌ నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. దీపావళి కానుకగా నవంబరు 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన ఈ చిత్రం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్

Pippa – జైలర్ ను వెనక్కి నెట్టిన పిప్పా

ప్రపంచ వ్యాప్తంగా హిట్ టాక్ సంపాదించుకుని బాక్సాఫీసు ముందు కలెక్షన్ల వర్షం కురిపించిన తలైవా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఓటీటీలో కూడా తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 10న రిలీజ్ అయిన జైలర్… అమెజాన్ ప్రైమ్ వేదికగా సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా గత శనివారం వరకు నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. అయితే సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన పిప్పా… జైలర్
సినిమాను వెనక్కి నెట్టి ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. దీనితో రజనీను వెనక్కి నెట్టిన మృణాల్ ఠాకూర్ అంటూ కొంతమంది నెటిజన్లు స్పందించగా… తలైవాతో మృణాల్ కు పోటీనా అయితే ఆమె పని అయిపోయినట్లే అంటూ మరికొందరు పోస్ట్ చేస్తున్నారు.

పిప్పా అసలు కథేంటంటే..

ఇషాన్‌ ఖట్టర్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ – పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించారు. బంగ్లాదేశ్‌ను ఆక్రమించుకుని ఈస్ట్ పాకిస్తాన్ చేయాలనుకున్న పాక్ దురుద్దేశాన్ని భారతసైన్యం అడ్డుకుంటుంది. అదే సమయంలో బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ చేసిన దారుణాలను తెరపైకి తెస్తుంది. దీనితో బంగ్లా విముక్తి కోసం ఉద్యమించిన వారితో పాటు సామాన్యులను సైతం అతి దారుణంగా హత్య చేసి, మహిళలు, పిల్లలను బందీలుగా చేసుకుంటూ ఉంటుంది పాకిస్తాన్. మరోవైపు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నా.. మానవత్వంతో ఆలోచించి బంగ్లా నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వచ్చిన లక్షల మంది శరణార్థులకు భారత్‌ ఆశ్రయం కల్పిస్తుంది. ఇది సహించలేని పాకిస్థాన్‌ భారత్‌పై పలుచోట్ల బాంబు దాడులు చేస్తుంది. పాకిస్తాన్ సైన్యం దారుణాల నుంచి భారత ఆర్మీ ఎలా రక్షించిందనే విషయాన్ని దర్శకుడు రాజా కృష్ణమేనన్ వెండితెరపై చాలా చక్కగా ఆవిష్కరించారు.

Also Read : Farzi: ఓటీటీలో నెంబర్ వన్ గా ఫర్జీ

JailerMrunal ThakurPippaRajani Kanth
Comments (0)
Add Comment