Saptagiri-Pellikani Prasad Sensational :న‌వ్వులు పూయించిన ‘పెళ్లి కాని ప్ర‌సాద్’

పెళ్లి కాని ప్ర‌సాద్ లు ఎంద‌రో

Pellikani Prasad : క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం పెళ్లి కాని ప్ర‌సాద్(Pellikani Prasad). పూర్తిగా ఇంటిల్లిపాది న‌వ్వుకునేలా చేశాడు ద‌ర్శ‌కుడు. ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న రావ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు పెట్టుకున్నారు. స‌ప్త‌గిరితో(Saptagiri) పాటు ప్రియాంక శ‌ర్మ , అన్న‌పూర్ణ కీల‌క పాత్ర‌లు పోషించారు. పూర్తిగా ఎంట‌ర్ టైన‌ర్ జాన‌ర్ లో ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు అభిలాష్ రెడ్డి గోపిడి. మార్చి 21న శుక్ర‌వారం పెళ్లికాని ప్ర‌సాద్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆద్యంత‌మూ న‌వ్వుకునేలా తీయ‌డం విశేషం. క‌థ పూర్తిగా ఆరోగ్య‌క‌రంగా ఉంటుంది. హీరోకు 36 ఏళ్లు. ఎప్పుడూ త‌న‌కు పెళ్లి కాక పోవ‌డంపై ఆందోళ‌న చెందుతాడు.

Pellikani Prasad Movie Viral

ఒక్క పైసా త‌క్కువ అయినా త‌ను పెళ్లికి ఒప్పుకోడు పెళ్లి కాని ప్ర‌సాద్ తండ్రి. ఏజ్ ప‌రంగా ఎక్కువ‌గా ఉన్నా పెళ్లి చేసుకోక పోవ‌డం వ‌ల్ల క‌లిగే అనుభ‌వం గురించి చెబుతూ రావ‌డం ఇందులో ప్ర‌త్యేక‌త‌. ఇదే స‌మ‌యంలో హీరోయిన్ కుటుంబం త‌మ కూతురితో పాటు త‌మ‌ను కూడా భ‌రించే వ‌రుడి కోసం వెతుకుతూ ఉంటుంది. మ‌రి ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లు ద‌గ్గ‌ర‌వుతారా..ప్ర‌సాద్ పాత్ర‌లో స‌ప్త‌గిరికి పెళ్లి అవుతుందా లేదా అనేది తెలుసు కోవాలంటే పెళ్లి కాని ప్ర‌సాద్ చిత్రం చూసి తీరాల్సిందే. ఎందుకంటే ఎలాంటి హింస‌, బూతులు లేకుండా హాయిగా న‌వ్వుకునేలా ఉంద‌న‌డంలో సందేహం లేదు.

ప్ర‌త్యేకించి డైరెక్ట‌ర్ ను అభినందించి తీరాల్సిందే. ముర‌ళీధ‌ర్ గౌడ్, ల‌క్ష్మ‌ణ్ పాత్రులు సినిమా హాస్యాన్ని పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. వీరితో పాటు అన్న‌పూర్ణ‌, ప్ర‌మోదిని, భాషా, శ్రీ‌నివాస్, ప్ర‌భావ‌తి, రోహిణి, రాం ప్ర‌సాద్ సంద‌డి చేశారు. సిద్దార్త్ కెమెరామెన్ గా చేయ‌గా శేఖ‌ర్ చంద్ర సంగీతం అందించాడు. థామా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్ కె వై బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్ , వైభవ్ రెడ్డి ముత్యాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దీనిని విడుదల చేస్తోంది.

Also Read : Hero Ram Charan : చెర్రీ థ‌మ‌న్ ను అన్ ఫాలో చేశాడా..?

CinemacomedianSapthagiriTrendingUpdates
Comments (0)
Add Comment