Payal Rajput : హైదరాబాద్ – ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యూత్ గుండెల్లో సెగలురేపి, ‘మంగళవారం’ మూవీతో మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.. ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాషల్లో ‘వెంకటలచ్చిమి’గా ఎంట్రీ ఇవ్వబోతోంది.
Payal Rajput Movie Updates
రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘వెంకటలచ్చిమి’ మూవీ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్బంగా డైరెక్టర్ ముని మాట్లాడారు. ‘‘వెంకటలచ్చిమి’గా కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్‌పుత్ సరిగ్గా సరిపోతారని అనిపించిందన్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయం అన్నారు.
మంగళవారం’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నానని, కానీ వెంకటలచ్చిమి కథ విన్నాక ఓకే చెప్పానని తెలిపారు నటి పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా వచ్చాక తన పేరు వెంకటలచ్చిమి గా మారి పోవడం ఖాయమన్నారు.
Also Read : Dil Raju-IT Raids Shocking : ఐటీ రైడ్స్ దిల్ రాజుకు బిగ్ షాక్