Payal Rajput: హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్ఎక్స్100 ఫేం పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో ప్రణదీప్ ఠాకోర్ దర్శక నిర్మాతగా తెరకెక్కించిన తాజా సినిమా ‘రక్షణ’. త్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా… పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో రోషన్, మానస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు.
Payal Rajput Movie Updates
టీజర్‌ను గమనిస్తే.. ఓ హంతకుడు క్రూరంగా హత్యలు చేస్తుంటాడు.. అతనెవరో కనిపెట్టి అరెస్ట్ చేయాలని పోలీస్ ఆఫీసర్ అయిన పాయల్ రాజ్‌పుత్ ప్రయత్నించే క్రమంలో పై డైలాగ్ హైలెట్ అనేలా టీజర్‌ని కట్ చేశారు. ‘‘వాడెవడో తెలియదు… కానీ ఎలాంటి వాడో తెలుసు. ఇప్పటి వరకు నేను కచ్చితంగా వాడిని కలవలేదు.. ఏరోజు నేను వాడ్ని కలుస్తానో అదే అఖరి రోజు’’ అంటూ పాయల్ వార్నింగ్ ఇచ్చిన డైలాగ్ సినిమాపై ఆశక్తిని పెంచుతోంది. ఇంతకీ పాయల్ అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందెవరికీ? ఎందుకోసం.. ఎవరినీ ఆమె వెతుకుతుంది? అనే వివరాలు తెలియాలంటే మాత్రం ‘రక్షణ’ సినిమా చూడాల్సిందే.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ మాట్లాడుతూ… ‘రక్షణ’ టీజర్ కు చాలా మంచి స్పందన వస్తోంది. ఇదొక ఓ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయిల్(Payal Rajput) ఇప్పటి వరకు కనిపించని ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తితో రాసిన కథ ఇది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.
Also Read : Mrunal Thakur: సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్ !