Payal Rajput: పాయల్ ప్రచారం కంటే కథపై నమ్మకం ఉంది- రక్షణ దర్శకుడు

పాయల్ ప్రచారం కంటే కథపై నమ్మకం ఉంది- రక్షణ దర్శకుడు

Payal Rajput: హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై ఆర్ఎక్స్100 ఫేం పాయ‌ల్ రాజ్‌పుత్‌(Payal Rajput) ప్రధాన పాత్రలో ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌ నిర్మాతగా తెరకెక్కించిన తాజా సినిమా ‘రక్షణ’. పాయల్ రాజ్‌పుత్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా… ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ లో రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌ గా తెరకెక్కించిన ఈ సినిమాపై దర్శకుడు ప్రణదీప్ ఠాకోర్ ఆశక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Payal Rajput…

‘‘ఓ పోలీసాఫీసర్‌ జీవితంలో జరిగిన ఘటనను స్ఫూర్తిగా తీసుకుని కల్పిత కథతో ‘రక్షణ’ తీశాను. ఈ సినిమాలో చిన్న సందేశం కూడా ఉంది. సినిమా మొత్తం ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లా ఉంటుంది. బాధితుల కోసం పోరాడటంతో పాటు వారిని రక్షించేలా ఉంటుంది కాబట్టి ‘రక్షణ’ అని టైటిల్‌ పెట్టాం’’ అన్నారు దర్శక, నిర్మాత ప్రణదీప్‌ ఠాకోర్‌. సినిమా తీయడం క్రియేటివ్‌… రిలీజ్‌ చేయడం మార్కెటింగ్‌ థింగ్‌. నేను సినిమా బాగానే తీశా. కానీ, మార్కెటింగ్‌ లో పూర్‌. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్‌ చేయడమే కష్టంగా మారింది’’ అన్నారు.

‘‘ఈ సినిమా కోసం పాయల్‌ 47రోజులు పని చేసింది. ఒప్పందం ప్రకారం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. తను ప్రమోషన్స్‌ కు వచ్చాక మేము ఇవ్వాల్సిన రూ.6లక్షలు ఇస్తామని చెప్పాం. కానీ, ఆమె ప్రమోషన్స్‌కు రావడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. రూ.20లక్షలు ఇస్తే వర్చువల్‌ గా సినిమాని ప్రమోట్‌ చేస్తానని ఆమె మేనేజర్‌ సౌరభ్‌ ధింగ్రా చెప్పారు. దీనిపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాను. ఏదేమైనా తను ప్రమోషన్స్‌కు రాకున్నా ఆమెకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్‌ ఇచ్చేస్తాను. నాకు నా కథ, సినిమాపై నమ్మకం ఉంది. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పూత్‌ తన పాత్రలో అద్భుతంగా నటించారు. కచ్చితంగా ఇందులో కొత్త పాయల్‌ను చూస్తారు. తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసే చిత్రమిది’’ అని దర్శకుడు ప్రణదీప్ అన్నారు.

Also Read : Rachna Banerjee: పార్లమెంట్ లో అడుగుపెడుతున్న టాలీవుడ్ బ్యూటీ !

Payal RajputRakshana
Comments (0)
Add Comment