Payal Rajput: తల్లి మోకాలి ఆపరేషన్ పై సెక్సీ బ్యూటీ ఎమోష‌న‌ల్ పోస్ట్ !

తల్లి మోకాలి ఆపరేషన్ పై సెక్సీ బ్యూటీ ఎమోష‌న‌ల్ పోస్ట్ !

Payal Rajput: టాలీవుడ్ లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సెక్సీ బ్యూటీగా గుర్తింపు పొందిన ఈ ఢిల్లీ బ్యూటీ… ఇటీవల ‘మంగళవారం’ సినిమాతో మరోసారి కుర్రకారుని ఆకట్టుకుంది. ‘మంగళవారం’ సినిమాతో క్రేజీ హిట్ కొట్టిన పాయల్ రాజ్ పుత్… తన సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. గ‌త‌కొంత‌కాలంగా మోకాలి నొప్పుతో బాధ‌ప‌డుతున్న తన త‌ల్లికి… రెండు రోజుల క్రితం ఆపరేష‌న్ చేయించినట్లు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది సెక్సీ బ్యూటీ పాయల్. అమ్మ‌కు నీ (knee) రీప్లేస్ మెంట్ సర్జ‌రీ జ‌రిగింద‌ని… ఇది చాలా నొప్పితో కూడుకున్న‌ద‌ని పేర్కొంది.

ఆప‌రేష‌న్ విజ‌య‌వంత‌మైంద‌ని… అమ్మ‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని తెలిపింది. త‌న‌కోసం ప్రార్థించండి అని అభిమానులను వేడుకుంది. ఆప‌రేష‌న్ అనంత‌రం త‌న త‌ల్లి న‌డిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వీడియోను తన ఇన్‌ స్టా గ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం పాయల్ పోస్ట్ చేసిన తన తల్లి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు పాయల్ కు తన తల్లికి అభిమానుల నుండి మద్దత్తు లభిస్తుంది.

Payal Rajput Comment

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ రాజ్ పుత్(Payal Rajput)… ఇటీవల తన ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంచుకునే క్యాండీ అనే పెట్ డాగ్ చనిపోయినట్లు భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టింది. ఇప్పుడు తన తల్లి మోకాలి ఆపరేషన్ గురించి పెట్టింది. ఆనందం వచ్చిన, కష్టం వచ్చినా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది ఈ సెక్సీ బ్యూటీ. ఇక ఆమె కెరియర్ విషయానికి వస్తే…. దాదాపు ఏడేళ్ళ పాటు హిందీ సీరియ‌ల్స్ చేయడం ద్వారా బుల్లితెర‌కే ప‌రిమిత‌మైన… పాయల్ 2017లో చ‌న్నా మెరియా అనే పంజాబీ సినిమాతో వెండితెరపైకి అరంగేట్రం చేసింది. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో పాయ‌ల్ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ఆ తరువాత త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. గ‌తేడాది రిలీజైన‌ మంగ‌ళ‌వారం సినిమాతో మ‌రోసారి త‌న స‌త్తా ఏంటో చూపించింది పాయ‌ల్‌. ప్ర‌స్తుతం త‌మిళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో కిరాత‌క అనే సినిమాలో న‌టిస్తోంది.

Also Read : Rakul Preet Singh: రకుల్‌-భగ్నానీ జంటకు ప్రధాని మోదీ స్పెషల్‌ విషెస్‌ !

MangalavaaramPayal RajputRX 100
Comments (0)
Add Comment