Payal Rajput: 16వ ‘జైపుర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ (JIFF)లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఆర్ఎక్-100 ఫేం అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్(Payal Rajput) కాంబినేషన్ లో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘మంగళవారం’ సినిమా మొత్తం నాలుగు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’, నిఖిల్ సిద్ధార్ధ నటించిన ‘కార్తికేయ-2’ సినిమాలు పలు అవార్డులకు ఎంపికయ్యాయి.
‘మంగళవారం’ సినిమాలోని నటనకు గాను పాయల్(Payal Rajput) ఉత్తమ నటి అవార్డుకు ఎంపికవగా… బెస్ట్ సౌండ్ డిజైనర్ గా ఎం. ఆర్. రాజా కృష్ణన్, బెస్ట్ ఎడిటింగ్ కు గుళ్లపల్లి మాధవ్ కుమార్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా ముదస్సర్ మహ్మద్ లు ఎంపికయ్యారు. ‘భగవంత్ కేసరి’లోని నటనకు గాను కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ లు ‘ఆనర్ ఆఫ్ ది సినిమా అవార్డు’ కు ఎంపికవగా… పీచర్ ఫిల్మ్ ఇండియన్ పనోరమ కేటగిరీలో ఉత్తమ నటిగా శ్రీలీల ఎంపికయ్యింది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పీరియాడికల్ డ్రామా ‘బింబిసార’ పలు అవార్డులను సొంతం చేసుకుంది.
Payal Rajput Viral
16వ ‘జైపుర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ లో మొత్తం 82 దేశాల నుంచి 2,971 సినిమాలు ఈ ఏడాది అవార్డులకు పోటీపడగా 67 దేశాలకు చెందిన 326 సినిమాలు నామినేట్ అయ్యాయి. తుది జాబితాను JIFF జ్యూరీ ఇటీవల విడుదల చేసింది. JIFF అవార్డులకు ఎంపికైన వారు… ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు జైపుర్ వేదికగా జరగనున్న JIFF వేడుకలో అవార్డులు అందుకోనున్నారు.
16వ ‘జైపుర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ విజేతల వివరాలు !
ఉత్తమ నటుడు రణ్‌బీర్.
ఉత్తమ చిత్రం 12th ఫెయిల్
ఆనర్ ఆఫ్ ది సినిమా అవార్డు
ప్రకాశ్ రాజ్: బింబిసార
అనుపమ్ ఖేర్: కార్తికేయ-2
అర్జున్ రాంపాల్: భగవంత్ కేసరి
కాజల్ అగర్వాల్: భగవంత్ కేసరి
‘మంగళవారం’ పురస్కారాలివీ..
ఉత్తమ నటి: పాయల్ రాజ్‌పుత్
బెస్ట్ సౌండ్ డిజైన్: ఎం. ఆర్. రాజా కృష్ణన్
బెస్ట్ ఎడిటింగ్: గుళ్లపల్లి మాధవ్ కుమార్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: ముదస్సర్ మహ్మద్
ఫీచర్ ఫిల్మ్: జె.ఐ.ఎఫ్.ఎఫ్. ఇండియన్ పనోరమ
గోల్డెన్ క్యామెల్ అవార్డ్ ఫర్ బెస్ట్ డైరెక్టర్: వశిష్ఠ (బింబిసార)
రెడ్ రోజ్ అవార్డ్ ఫర్ బెస్ట్ రిలీజ్‌డ్ ఫిల్మ్: బింబిసార
బెస్ట్ మేకప్, హెయిర్ స్టైలింగ్: బింబిసార
ఉత్తమ నటి: శ్రీలీల (భగవంత్ కేసరి)
Also Read : Puspha 2: ‘పుష్ప -2’ కౌంట్‌డౌన్ షురూ చేసిన చిత్ర యూనిట్ !