Hero Pawan Kalyan Wife :ప‌వ‌న్ భార్య అన్నా లెజ్నెవా త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ‌

కొడుకు కోసం శ్రీ‌వారిని మొక్కుకున్న స‌తీమ‌ణి

Pawan Kalyan : తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా. ఈ సంద‌ర్బంగా త‌న త‌న‌యుడు సుర‌క్షితంగా అగ్ని ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ‌డంతో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలుమంగ‌మ్మ‌ల‌ను మొక్కుకుతంది. సింగ‌పూర్ లో చ‌దువుకుంటున్న ప‌వ‌న్ కొడుకు సుర‌క్షితంగా ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇదంతా ఆ కలియుగ దైవం కార‌ణంగానే జ‌రిగింద‌ని త‌ను న‌మ్మింది. ఆ వెంట‌నే త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకుంటాన‌ని మొక్కుకుంది. ఈ మేర‌కు భారీ భ‌ద్ర‌త న‌డుమ తిరుమ‌ల‌కు చేరుకుంది. ఆమెకు ఆల‌య అధికారులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

Pawan Kalyan Wife Anna Lezhneva Offered Hair

మ‌తం రీత్యా త‌న‌ది హిందూ మ‌తం కాదు. ఆమె స్వ‌స్థలం ర‌ష్యా. ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) రేణూ దేశాయ్ తో విడాకులు ఇచ్చాక త‌న‌ను పెళ్లి చేసుకున్నాడు. దీంతో త‌న‌తోనే సహ‌జీవ‌నం చేస్తున్నాడు. ఈ స‌మ‌యంలో త‌ను టీటీడీ అధికారుల ముందు డిక్ల‌రేష‌న్ ప‌త్రంపై స్వ‌యంగా సంత‌కం చేసింది భార్య అన్నా లెజ్నెవా. ఇదిలా ఉండ‌గా టీటీడీ పాల‌క మండ‌లి నిర్ణ‌యం ప్ర‌కారం ఆల‌యాన్ని ఎవ‌రు సంద‌ర్శించినా, హిందూయేత‌రులు, అన్య‌మ‌త‌స్తులు ముందుగా త‌మ రూల్ ప్ర‌కారం సంత‌కం చేయాల్సిందే.

ఇదే విష‌యాన్ని ఇప్ప‌టికే ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు సైతం తెలియ చేశారు. ఆయ‌న కూడా సంత‌కం చేశాడు. ఆయ‌న‌తో పాటు కూతురు కూడా గ‌తంలో ప‌ర్య‌టించిన సంద‌ర్భంలో డిక్ల‌రేష‌న్ పై సంత‌కాలు పెట్టారు. అనంత‌రం ప‌వ‌న్ భార్య అన్నా లెజ్నెవా స్వ‌యంగా క‌ళ్యాణ క‌ట్ట వ‌ద్ద‌కు వెళ్లారు. త‌ను కోరుకున్న మీద‌ట కొడుకు సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ‌డంతో ఆనందంతో త‌ల గుండు చేయించుకున్నారు. త‌లీనాల‌ను స్వామి వారికి స‌మ‌ర్పించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Also Read : Beauty Anupama Dating :ధ్రువ్ విక్ర‌మ్ తో అనుప‌మ ప‌రమేశ్వ‌రన్ డేటింగ్ 

Anna lezhnevapawan kalyanTirumala Tirupathi DevastanamUpdatesViral
Comments (0)
Add Comment