Pawan Kalyan : ‘ఓజీ’ సినిమా షూటింగ్ షురూ చేసిన హీరో పవర్ స్టార్

ఇదిలా ఉండగా త్వరలోనే ‘ఓజీ’సెట్‌లోకీ అడుగు పెట్టనున్నారు పవన్‌కల్యాణ్‌...

Pawan Kalyan : పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఖాతాలో వరుస చిత్రాలున్న సంగతి తెలిసిందే. రాజకీయాలతో బిజీగా కావడం వల్ల సినిమా షూటింగ్‌లకు కాస్త విరామం ఇచ్చారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మధ్యలో సినిమాలకి సమయం కేటాయిస్తున్నారు. సెట్స్‌ మీదున్న మూడు చిత్రాల షూటింగ్‌ రీ స్టార్‌ చేశారు. ‘ హరి హర వీరమల్లు’ చిత్రీకరణ ఇటీవల విజయవాడలో మొదలుపెట్టారు. విజయవాడలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

Pawan Kalyan Movie Updates

ఇదిలా ఉండగా త్వరలోనే ‘ఓజీ’సెట్‌లోకీ అడుగు పెట్టనున్నారు పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan). సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. చిత్రీకరణ పునః ప్రారంభించినట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. కథానాయకుడు లేని కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇమ్రాన్‌ హస్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియారెడ్డి, హరీస్‌ ఉత్తమన్‌, అభిమన్యు సింగ్‌ కీలక పాత్ర ధారులు. ప్రియాంక ఆరుల్‌ మోహన్‌ కథానాయిక. ప్రస్తుతం జరుగుతున్న ‘హరిహర వీర మల్లు’ పూర్తయిన తర్వాత, పవన్‌కల్యాణ్‌ ‘ఓజీ’ సెట్లోకి అడుగు పెట్టనున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితోపాటు ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ కూడా పూర్తి చేయాల్సి ఉంది. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Also Read : Nayanthara : ‘డియర్ స్టూడెంట్’ సినిమా షూటింగ్ లో బిజీగా కానున్న నయనతార

Moviesogpawan kalyanTrendingUpdatesViral
Comments (0)
Add Comment