Pawan Kalyan: ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయఢంకా మ్రోగించింది. ఏపీలో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లలో గెలుపొంది… భారతదేశంలో వంద శాతం స్ట్రైక్ రేట్ తో రికార్డు సృష్టించారు. దీనితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా మారారు. దీనితో ఇటు సినీవర్గాల్లోనూ… అటు ఆయన అభిమానుల్లోనూ జోష్‌ను నింపింది.
Pawan Kalyan…
ఈ నేపథ్యంలోనే పవన్(Pawan Kalyan) కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఓజీ’ సినిమా యూనిట్ మంగళవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో పవన్ కళ్యాణ్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ గా కుర్చీలో కుర్చోని కనిపించారు. ‘‘ఎవ్వరికీ అందదు అతని రేంజ్.. రెప్ప తెరిచేను రగిలే రివేంజ్’’ అంటూ ఆ పోస్టర్‌కు ఓ ఆసక్తికర కామెంట్ ను చిత్ర యూనిట్ పైన ఉంచింది. యువ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో… ఓజాస్ గంభీర అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు పవన్. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ విజయంపై ‘హరి హర వీరమల్లు’ సినిమా యూనిట్ కూడా ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ‘ధర్మందే విజయం’ అంటూ ప్రత్యేక పోస్టర్ తో పవన్ కు ఆ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది. ఇటీవల విడుదల చేసిన హరి హర వీరమల్లు టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
Also Read : Satyaraj: రజనీకాంత్ తో తనకు విభేదాలపై క్లారిటీ ఇచ్చిన సత్యరాజ్ !