Hero Pawan Kalyan Son Akhira :టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌నున్న అకిరా నంద‌న్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో కలిసి ప్ర‌సిద్ద ఆల‌యాల ద‌ర్శ‌నం

Akhira : మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో స్టార్ తెరంగేట్రం చేయ‌నున్నాడా. అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది సినీ వ‌ర్గాల‌లో. ఇప్ప‌టికే ఇదే కుటుంబం నుంచి పెద్ద ఎత్తున హీరోలు ఉన్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి , డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్, కొణిదెల నాగ బాబు, అల్లు అర్జున్ , వ‌రుణ్ తేజ్ , రామ్ చ‌ర‌ణ్ తేజ, నిహారిక కొణిద‌ల‌..సాయి ధ‌ర‌మ్ తేజ్..ఇలా త‌మ‌దైన రీతిలో మూవీస్ లో బిజీగా ఉన్నారు.

Akhira Nandan Movie

ప్ర‌స్తుతం ప‌వ‌న్ కళ్యాణ్(Pawan Kalyan) ఉప ముఖ్య‌మంత్రిగా బిజీగా ఉన్నారు. ఓ వైపు పాల‌నా ప‌రంగా ప‌నులు చేస్తూనే మ‌రోవైపు సినిమాల‌పై దృష్టి సారించారు. త‌ను ప్రస్తుతం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రం పూర్తి చేసే ప‌నిపై దృష్టి సారించాడు. ఇక చిరంజీవి విశ్వంభ‌ర‌లో న‌టిస్తుండ‌గా కొత్త చిత్రానికి సంత‌కం కూడా చేశాడు. త‌ను మినిమం గ్యారెంటీ ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన క‌డుపుబ్బా న‌వ్వించే స‌త్తా క‌లిగిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో ఫుల్ లెంగ్త్ కామెడీని పండించేందుకు సిద్దమై పోయాడు.

ఈ త‌రుణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌యుడు అకిరా నంద‌న్ కూడా త్వ‌ర‌లోనే తెలుగు చ‌ల‌న చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చేందుకు ఓకే చెప్పాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌ను రేణు దేశాయ్ కి పుట్టిన కొడుకు. ప్ర‌స్తుతం త‌ను త‌న తండ్రి వెంట పుణ్య క్షేత్రాల‌ను ద‌ర్శించుకున్నాడు. వీరి వెంట టీటీడీ బోర్డు స‌భ్యుడు , క‌ళా ద‌ర్శ‌కుడు ఆనంద సాయి ఉన్నాడు.

Also Read : నాగ్ అశ్విన్ మూవీలో అలియా భ‌ట్

Akhira NandanMoviespawan kalyanTrendingUpdates
Comments (0)
Add Comment