Pawan Kalyan : ఇండియా కంటే భార‌త్ బెట‌ర్

సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్
Pawan Kalyan :  ఇండియా కంటే భార‌త్ బెట‌ర్

Pawan Kalyan : జ‌న‌సేన పార్టీ చీఫ్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంతోషం వ్య‌క్తం చేశారు. తాజాగా ఇండియా పేరును తీసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్. గెజిట్ కూడా విడుద‌ల చేసింది. ఇక నుంచి ఇండియా పేరు వాడ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌తి ఒక్క‌రు భార‌త్ లేదా భార‌త దేశం అని వాడాల‌ని కుండ బద్ద‌లు కొట్టింది.

Pawan Kalyan Comment

తాజాగా మోదీ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ఓ వైపు వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్ అంటోంది. మ‌రో వైపు భార‌త దేశాన్ని హిందూ దేశంగా మార్చాల‌ని హిందూ సంప్ర‌దాయ వాదులు, సంఘాలు, సంస్థ‌లు పేర్కొంటున్నాయి.

ఈ త‌రుణంలో కీల‌క ప్ర‌క‌ట‌న రావ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది. భార‌త ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని తాను హృద‌య పూర్వ‌కంగా స్వాగ‌తిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan). ఇండియా అన్న‌ది అరువు తెచ్చుకున్న‌ద‌ని, కానీ భార‌త దేశం అన్న‌ది ప‌విత్ర‌మైన ప‌ద‌మ‌ని పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల‌లో సైతం ఇండియా పేరును తొల‌గించి భార‌త్ ను చేర్చాల‌ని స్ప‌ష్టం చేసింది కేంద్రం.

Also Read: Shreya Saran Vs Keerthy Suresh

Comments (0)
Add Comment