Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఫ్యామిలీకి సంబంధించిన రేర్ పిక్‌ని పోస్ట్ చేశారు. ఈ మధ్య పొలిటికల్ పోస్ట్ లే చేస్తున్న పవర్ స్టార్… తాజాగా తన సోదరితో ఉన్న రేర్ ఫొటోని షేర్ చేసి.. మెగాస్టార్ బర్త్ డే రోజున మెగాభిమానులకు మరింత ఆనందాన్నిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో ఆయన, తన సోదరితో కలిసి బెంగాల్ టైగర్స్ తో ఫొటో దిగారు. ఈ ఫొటోకి నెటిజన్లు కూడా అదిరిపోయే కామెంట్స్ చేస్తున్నారు.
Pawan Kalyan…
ఓ స్టూడియోలో రెండు టాయ్ బెంగాల్ టైగర్స్ మాదిరిగా పోజులిచ్చిన పిక్ ఇది. ‘‘నేను, నా సోదరి బెంగాల్ టైగర్స్‌ని పోలినట్లుగా పోజులిచ్చిన అపురూపమైన జ్ఞాపకం’’ అని ఈ పిక్ గురించి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఇక ఈ పిక్ కు నెటిజన్లు.. అక్కడ ఉన్నది రెండు బెంగాల్ టైగర్స్ కాదు.. మూడు అంటూ.. పవన్ కళ్యాణ్ ని కూడా ఓ టైగర్ లా వర్ణిస్తున్నారు. ‘రాయల్ బెంగాల్ టైగర్ సిద్దు సిద్దార్థరాయ్ విత్ బెంగాల్ టైగర్స్’, ‘అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే అన్నయ్య’ అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌తో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇక తన అన్నయ్య చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉదయమే.. ‘ఆపద్బాంధవుడు అన్నయ్య’ అంటూ శుభాకాంక్షలతో అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు ఎన్నో. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు.. అభ్యర్థిస్తారు. ఆ గుణమే చిరంజీవిగారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో.
గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో రూ. ఐదు కోట్ల విరాళాన్ని జనసేన పార్టీకి అందజేసి విజయాన్ని అందుకోవాలని మా ఇలవేల్పు ఆంజనేయుని సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించారు. ఆయన ఆ రోజు ఇచ్చిన నైతిక బలం, మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలుపుతున్నా. తల్లిలాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుడిని మనసారా కోరుకుంటున్నా’’ అని పవన్ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read : Kiran Abbavaram: రహస్యను పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం !