Pawan Kalyan OG Teaser : ప‌వర్ స్టార్ ఓజీ టీజ‌ర్ అప్ డేట్

సుజీత్ ద‌ర్శ‌క‌త్వం లో సినిమా

Pawan Kalyan OG Teaser : సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఓజీ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే త‌మిళ సినీ దిగ్గ‌జ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ తో క‌లిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో లో న‌టించారు. ఈ సినిమా విడుద‌లైంది. ప్రేక్ష‌కుల మ‌న‌సు చూర‌గొంది.

Pawan Kalyan OG Teaser Viral

తాజాగా సుజీత్ సార‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) ఓజీ సినిమాలో న‌టిస్తున్నాడు. దీనిని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈ మూవీలో ప‌వ‌ర్ స్టార్ తో పాటు ప్రియాంక అరుల్ మోహ‌న్ , అర్జున్ దాస్ , ఇమ్రాన్ హ‌స్మీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌వి కె చంద్ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

ఓజీ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ప్ర‌కాష్ రాజ్ , అర్జున్ దాస్ , శ్రేయ రెడ్డి, హ‌రీష్ ఉత్త‌మ‌న్ , షామ్ కూడా ఓజీ చిత్రంలో పాలు పంచుకున్నారు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రానికి సంబంధించి రాబోతున్న ఓజీ చిత్రంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఆశ‌లు పెట్టుకున్నారు. త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేసే ప‌వ‌ర్ స్టార్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

Also Read : Jailer Record : జైల‌ర్ మూవీ క‌లెక్ష‌న్ల సునామీ

Comments (0)
Add Comment