Pawan Kalyan-Nitin: పవన్‌ కల్యాణ్‌తో నితిన్‌ సినిమా ?

పవన్‌ కల్యాణ్‌తో సినిమాకు సిద్ధమంటున్న నితిన్‌

పవన్‌ కల్యాణ్‌తో నితిన్‌ సినిమా ?

 

Pawan Kalyan-Nitin : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోట్లాది మంది వీరాభిమానుల్లో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ ఒకరు. పవన్ కళ్యాణ్ ను చూస్తే చాలు అనుకునే నితిన్ ఏకంగా అతనితో పలుమార్లు కలవడమే కాకుండా… తన సినిమా ఆడియో రిలిజ్ పంక్షన్లకు ముఖ్యఅతిధిగా విచ్చేయడంతో ఈ యంగ్ హీరో ఆనందానికి అవధులు లేవు. దీనితో ఏ చిన్న అవకాశం వచ్చినా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను ఆకాశమంత ఎత్తుకు ఎత్తడంతో నిర్మాత బండ్ల గణేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ తరువాత… హీరోగా నితిన్ ముందు వరుసలో ఉంటారు.

అయితే తాను హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘ఎక్స్‌ట్రా’ టైటిల్… ఆర్డినరీ మ్యాన్‌.. ట్యాగ్‌లైన్‌ తో తెరకెక్కించిన సినిమా ప్రమోషన్ లో నితిన్ ఆశక్తికరమైన కామెంట్లు చేసారు. హైదరాబాద్‌లోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో నిర్వహించిన ‘బ్రష్‌ వేస్కో’ పాట విడుదల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో మీ సినిమా ఎప్పుడంటూ విద్యార్ధులు అడిగిన ప్రశ్నలపై నితిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Pawan Kalyan-Nitin – పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నా… నితిన్

పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఎప్పుడు నటిస్తారు? అని ఓ విద్యార్ధి అడిగిన ప్రశ్నకు హీరో నితిన్… ఆ అవకాశం కోసం నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా… అంటూ సమాధానం ఇచ్చారు. దీనితో దేవుడి ప్రత్యక్షమై వరమిస్తానంటే… భక్తుడు వద్ధంటాడా అంటూ నితిన్(Nitin) వ్యాఖ్యలపై అభిమానుల కామెంట్లు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వస్తే చేసేయడమే… తప్ప ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే ప్రశ్నలకు తావులేదు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. దీనితో పవన్-నితిన్ కాంబోలో సినిమా రావడం తధ్యం అనికి కూడా మరికొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అఆ సినిమాతో త్రివిక్రమ్ కు చాలా దగ్గర అయిన నితిన్(Nitin)… త్రివిక్రమ్ సహకారంతో ఖచ్చితంగా అవకాశాన్ని చేజిక్కుంచుకుంటారు అని అటు పవన్ ఇటు నితిన్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

డిసెంబరు 8న ‘ఎక్స్‌ట్రా’గా వస్తున్న నితిన్

ప్రముఖ దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా.. యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎక్స్‌ట్రా’. నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 8న రిలీజ్ కాబోతుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా నుంచి డేంజర్ పిల్లా పాటను విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. తాజాగా సెకండ్ సింగిల్ బ్రష్‌ వేసుకో అంటూ సాగే రెండో పాటను హైదరాబాద్‌లోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ లో విడుదల చేయడం ద్వారా సినిమా ప్రమోషన్ లో స్పీడ్ పెంచారు.

Also Read : Big Boss 7: చరణ్ సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్

 

 

extranitinpawan kalyan
Comments (0)
Add Comment