Pawan Kalyan: జయాపజాలతో సంబంధం లేకుండా కలెక్షన్లలో, ఫ్యాన్ ఫాలోయింగ్ లో టాప్ లో ఉన్న టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు కళ్ళళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి ఉండదు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి మూడు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూనే పాటు మరో రెండు సినిమాలు చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఒక వైపు రాజకీయాలు, మరోవైపు సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
Pawan Kalyan Movie Updates
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ (OG) సినిమా సెప్టెంబర్ 27న వరల్డ్‌వైడ్ గా థియేటర్లలోకి రానున్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి ప్రకటన లేకపోయినప్పటికీ… సెప్టెంబర్ 27న ఓటీ వస్తుందనే వార్త… సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ కూడా సెప్టెంబరు 27వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో… ఆ రిలీజ్ డేట్ సెంటిమెంట్ ఓజీకి పనికొస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న స్ట్రెయిట్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హస్మీ విలన్ గా నటిస్తున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెంకట్ కీల పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో 15రోజులు పవన్ షూటింగ్‌లో పాల్గొంటే సినిమా మొత్తం పూర్తయినట్టే అని టాలీవుడ్ వర్గాల టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బడా నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజైన టైటిల్ ఫస్ట్ లుక్, సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Megastar Chiranjeevi: పద్మశ్రీ గ్రహీతలను సత్కరించిన మెగాస్టార్ !