Pawan Kalyan: పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై అతని తల్లి అంజనాదేవీ కీలక వ్యాఖ్యలు చేసారు. కుమారుడు గెలుపుపై అంజనా దేవి తన సంతోషాన్ని ఓ వీడియో ద్వారా వ్యక్తం చేశారు. ఆ పార్టీ గుర్తు గాజు గ్లాసును ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడడం అందరినీ ఆకర్షిస్తోంది. ‘‘మా అబ్బాయి రాజకీయాల్లో విజయం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు తగ్గ ఫలితం ఇచ్చాడు. ఈ రోజు నుంచి గాజు గ్లాసులోనే టీ తాగుతా’’ అంటూ టీని ఆస్వాదిస్తూ ఆమె వీడియోలో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
విలాసవంతమైన జీవితం గడపాల్సిన తనయుడు… ప్రజాసేవకు కదిలి ఎందరితోనో మాటలు పడితే ఏ తల్లికైనా బాధ కలుగుతుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా కొడుకు అనుకున్నది సాధిస్తే ఆమె ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ప్రస్తుతం ఈ అనుభూతినే పొందుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి.
Pawan Kalyan Mother – గర్వపడే రోజు ఇది – రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తన బాబాయ్ పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘మన కుటుంబం గర్వపడే రోజు ఇది’ అంటూ జనసేనానిని ప్రశంసించారు.
Also Read : Hema Malini: లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టిన బాలీవుడ్ సీనియర్ నటి !