Chiranjeevi : తన రాజకీయ సత్తాను నిరూపించుకుంటూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అతని కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు మరియు అతని కారు ప్రధాన గేటు గుండా వెళుతుండగా అభిమానులు హర్షధ్వానాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇల్లు సందడితో నిండిపోయింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారిగా చిరంజీవి నివాసానికి వెళ్లారు. దీంతో చిరు ఫ్యామిలీ అంతా హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. కుటుంబసభ్యులంతా పవన్‌కు ఘన స్వాగతం పలికారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్‌ను కౌగిలించుకుని విషెస్‌తో ముంచెత్తారు.
Chiranjeevi Meet..
ఇంట్లోకి అడుగుపెట్టిన పవన్ దంపతులు తల్లి, సోదరుడు చిరంజీవి పాదాలకు నమస్కరించారు. చిరును కౌగిలించుకోవడంతో పవన్ పొంగిపోయాడు. అఖిర నందన్ సందడి అందరినీ కదిలించింది. అందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడటం కనిపించింది. జనసేన అద్భుత విజయంతో చిరు ఇంట ఆనందం వెల్లివిరిసింది. అనంతరం చిరు అభిమానులు, జనసేన కార్యకర్తలు చిరంజీవి ఇంటికి చేరుకుని సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు.
Also Read : Anupama Parameswaran : నాకు అలాంటి మసాజ్ కావాలంటున్న నటి అనుపమ