Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం జనసేన కార్యకర్తలు, అభిమానులతో గొల్లప్రోలు నుండి ర్యాలీగా బయలుదేరిన జనసేనాని… పిఠాపురంలోని తన నామినేషన్ సమర్పించారు. ఈసందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు, అప్పుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సినిమాలతో పాటు, వివిధ వ్యక్తిగత అవసరాల కోసం పవన్ రూ. 46.70 కోట్ల అప్పు చేసినట్లు అఫిడవిట్ లో తెలిపారు. అత్యధికంగా విజయ్ లక్ష్మి వి.ఆర్. నుంచి రూ.8 కోట్లు అప్పుగా చేయగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి రూ.10 లక్షలు మాత్రమే తీసుకున్నారు. చిరంజీవి సతీమణి, పవన్ వదిన అయిన కొణిదెల సురేఖ వద్ద రూ. 2 కోట్లు అప్పు చేసినట్లు ఈ అఫిడవిల్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan Comment
ఇక పవన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’, క్రిష్ దర్శకత్వంలో ‘హరి హరి వీరమల్లు’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు, రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. వీటితో పాటు, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను కూడా ప్రకటించారు.
Also Read : Directors Day: మే 4న డైరెక్టర్స్ డే నిర్వహణకు దర్శకుల ఏర్పాట్లు !