Pawan Kalyan: స్పెషల్ గెస్ట్ ను పరిచయం చేసిన పవన్ కళ్యాణ్

స్పెషల్ గెస్ట్ ను పరిచయం చేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan : తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక క్రేజ్ ఉన్న సినీ రాజకీయ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ గా ఒకవైపు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలతో… జనసేన అధినేతగా మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న బహిరంగ సభలు, రోడ్ షోలకు హాజరవుతూ ఎన్నికల్లో తన పార్టీతో పాటు తమతో పొత్తు పెట్టుకున్న బిజేపి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్ పోర్ట్ లో బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ను ఓ అనుకోని అతిథి కలిసింది. ఆ అనుకోని అతిథి గురించి పవన్ కళ్యాణ్… ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరగా మారుతోంది.

Pawan Kalyan – ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చిన బిందు

తెలంగాణా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పోస్ట్ చేసిన వీడియో విషయానికి వస్తే ‘‘బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్‌ కోసం ఎదురుచూస్తున్నప్పుడు డాగ్‌ స్క్వాడ్‌కు చెందిన బిందు అనే జాగిలం అనుకోని అతిథిగా నా వద్దకు వచ్చింది. దాని స్నేహపూర్వక ప్రవర్తన నా మనసుకు ఆనందాన్ని ఇచ్చింది. టేకాఫ్‌కు ముందు ఊహించని విధంగా ఓ అందమైన అనుభూతిని ఇచ్చింది’’ అంటూ ఆ వీడియోను పోస్ట్ చేసారు.

ఇన్ స్టా లో రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్

సోషల్ మీడియాను అరుదుగా ఉపయోగించే పవన్‌కల్యాణ్‌ ఈ ఏడాది జులై నెలలో తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ను క్రియేట్ చేసారు. ఇన్ స్టా గ్రామ్ అకౌండ్ క్రియేట్ చేసి, ఎటువంటి పోస్ట్ పెట్టకుండానే… కొన్ని గంటల్లోని మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుని రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయనకు 2.8 మిలియన్ల మంది ఆయనని ఫాలో అవుతుండగా.. ఆయన మాత్రం ఇంతవరకు ఎవరినీ ఫాలో కావడం లేదు. ఇప్పటివరకూ ఆయన కేవలం ఏడు పోస్టులు మాత్రమే చేయగా తాజాగా పోస్ట్ చేసిన బిందు వీడియోను 6 లక్షల మందికి పైగా లైక్‌ కొట్టారు.

Also Read : Surya: ‘కంగువా’ షూటింగ్ లో గాయపడ్డ హీరో సూర్య

janasenapawan kalyanpspk
Comments (0)
Add Comment