Hari Hara Veera Mallu : పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu)’. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది. మొదటి భాగం చిత్రీకరణ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దసరా సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బాహుబలి సినిమాలో ప్రభాస్ చెప్పిన ‘నద్వే మణిబంధం బహిర్ముకం’ తరహాలో పవన్ కళ్యాణ్ ఇందులో విల్లుతో కనిపిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే. ప్రభాస్ కుడి చేతితో ప్రదర్శించిన విద్యను.. పవన్ ఎడమ చేతితో ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ను నెటిజన్లు, అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.
Hari Hara Veera Mallu Movie Updates
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ విజయవాడలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో జరుగుతుంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలి భాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుేసన్ గుప్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.
Also Read : Game Changer : సంక్రాంతికి సిద్ధమవుతున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా