Pawan Kalyan: నూకాంబికా అమ్మవారి సేవలో పవన్ కళ్యాణ్ !

నూకాంబికా అమ్మవారి సేవలో పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయాన్ని అందుకుని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా మారిన జనసేన(Janasena) అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అనకాపల్లిలోని నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను గెలిస్తే అనకాపల్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటానని ఎన్నికల ముందు మొక్కుకున్నట్లు గతంలో బహిరంగ సభలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పాల్గొన్న జనసేనాని… ప్రత్యేక విమానంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో కలిసి విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో అనకాపల్లి చేరుకుని నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు, కమిటీ సభ్యులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ అనకాపల్లి పర్యటనను ఎంత గోప్యంగా ఉంచినప్పటికీ… జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. దీనితో నూకాంబికా అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.

Pawan Kalyan Visited

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీ చేసి 164 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని అధికారం చేజిక్కించుకుంది. ప్రస్తుతం కేంద్రంలోని ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా టీడీపీ, జనసేన కూడా మారడంతో అంతా ఢిల్లీ బాట పట్టారు. ఆదివారం సాయంత్రి ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఏపీకు చెందని ఇద్దరు టీడీపీ, ఒక బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. దీనితో ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర బాట పట్టిన టీడీపీ, జనసేన అధినేతలు… ఈ నెల 12న గన్నవరం విమానశ్రయం పరిసర ప్రాంతాల్లో నిర్వహించబోయే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు, మంత్రి వర్గ కూర్పులో బిజీగా ఉన్నారు. అయితే అధికారంలోకి వస్తే అనకాపల్లిలో నూకాంబికా అమ్మవారిని దర్శిచుకుంటాను అని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ మొక్కుకున్నారు. ఆ మొక్కుని ఈరోజు తీర్చుకున్నారు.

Also Read : Noor Malabika: అనుమానాస్పద రీతిలో బాలీవుడ్ నటి మృతి ! పట్టించుకోని కుటుంబ సభ్యులు !

Hari Hara Veera Mallujanasenapawan kalyanUstad Bhagat Singh
Comments (0)
Add Comment