Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు తను తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే మంగళవారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్న పవన్ రాత్రి అక్కడే బస చేశారు. ఈ రోజు స్వామి వారి దర్శనం నేపథ్యంలో తన ఇద్దరు కూతుర్లతో కలిసి పవన్ స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెలను మొదటిసారి మీడియా ముందుకు తీసుకురావడమే కాక శ్రీవారి దర్శనం కోసం డిక్లరేషన్ ఇప్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చ ఇచ్చిన డిక్లరేషన్ పత్రాలపై కుమార్తె పలీనా అంజనితో సంతకాలు చేయించారు. అయితే పలీనా మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.
Pawan Kalyan in Tirumala..
ఇదిలాఉండగా పవన్ కల్యాణ్ పెద్ద కూతురు ఆధ్య, కుమారుడు అఖిరా నందన్ తరుచూ మీడియాలో కనిపించడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం అయ్యారు. అయితే పవన్ కల్యాణ్ చిన్న కూతురు ఎప్పుటూ బయటి ప్రపంచానికి అంతగా తెలియకపోవడం.. సడన్‌గా ఈ రోజు తండ్రి, అక్కతో కలిసి సడన్‌గా పబ్లిక్‌లోకి రావడంతో ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చాలామంది ఇప్పుడు ఈ ఫొటోల గురించి, పవన్ చిన్న కూతురు గురించే మాట్లాడుకోవడం విశేషం.
Also Read : Devara Promotions : దేవర ప్రమోషన్స్ లో జక్కన్న పై చేసిన కామెంట్స్ కు భగ్గుమన్న అభిమానులు