Pawan Kalyan : “తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటే సినిమాలే తీసే వాళ్లే మాట్లాడాలి. సినిమాలే తీసే వాళ్లతోనే మేం మాట్లాడుతాం. సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పనేంటీ? నిర్మాతలు రావాలి. హీరోలు వచ్చి నమస్కారాలు చేయాలి అనేంతా కింది స్థాయి వ్యక్తులం కాదు. ఎన్టీఆర్ పాటించిన ఔన్నత్యాన్ని మేం పాటిస్తున్నాం. సినీ పరిశ్రమపై మా కూటమి ప్రభుత్వానికి గౌరవం ఉంది. సీఎం చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు.రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్‘ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన అతిథిగా హాజరయ్యారు. సినిమా టికెట్ ధల పెంపుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. డిమాండ్ అండ్ సప్లై ఆధారంగానే టికెట్ ధర పెంపు ఉంటుంది. ప్రభుత్వం టికెట్ ధరలు ఊరికే పెంచడం లేదు. టికెట్ ధరల వల్ల జీఎస్టీ కడతారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
Pawan Kalyan Comment
గత ప్రభుత్వం బీమ్లానాయక్ చిత్రానికి టికెట్ ధరలు పెంచలేదు. కూటమి ప్రభుత్వానికి సినీ నటులు అందరూ మద్దతు తెలపలేదు. అయినా కూడా మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. సినీ పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు ’’ అని స్పష్టం చేశారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని కాదు. భారతీయ చిత్ర పరిశ్రమ అనేదే మన నినాదం. హాలీవుడ్ పద్థతులు పాటించకపోయినా ‘వుడ్’ మాత్రం తీసుకున్నాం. మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపించాలి. చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ రావాలి. నిజ జీవితంలో జరగని సంఘటనలు సినిమా ప్రపంచంలో స్ఫూర్తినిస్తాయి. సినిమా ప్రపంచంలో విలువలుంటాయి. సినిమా.. మంచి, చెడు రెండింటినీ చూపిస్తుంది. ఏది తీసుకోవాలో ప్రేక్షకుల ఇష్టం. కేవలం డబ్బులు సంపాదించడం కాదు.. విలువలు కూడా నేర్పించాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమాజాన్ని ఆలోచింపచేసే బాధ్యతతో సినిమాలు తీయాలి’’ అని పవన్ అన్నారు.
Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
Pawan Kalyan : సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం నాకు నచ్చదు
గత ప్రభుత్వం బీమ్లానాయక్ చిత్రానికి టికెట్ ధరలు పెంచలేదు...