Pawan Kalyan : రతన్ టాటా మృతిపై విచారం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్, ఇతర నటులు

ఆయన కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయం...

Pawan Kalyan : భార‌త్ గ‌ర్వించే పారిశ్రామిక వేత్త ర‌త‌న్ టాటా మ‌ర‌ణంపై సెట‌బ్రిటీల స్పంద‌న కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే తెలుగు సినీ ప‌రిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి , ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్పందించి త‌మ సంతాపం తెలుప‌గా తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), కింగ్ నాగార్జున, రామ్ చరణ్ రెస్పాండ్ అయ్యారు. త‌మ సామాజిక మాధ్య‌మాల ద్వారా సానుభూతి తెలుపుతూ టాటాకు నివాళులు ఆర్పించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ శ్రీ రతన్ నోవల్ టాటా గారి మరణం భారతదేశానికి తీరని లోటు.. భారత పారిశ్రామిక రంగానికి కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా గారు ఆదర్శంగా నిలిచారు. ఆయన నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని, విమానయాన రంగంలో వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారు.

Pawan Kalyan Post…

ఆయన కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయం. ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది, ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నాను. అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్(Pawan Kalyan), త‌న పోస్టులో వ్రాసుకొచ్చారు. ఇక నాగార్జున .. శ్రీరతన్ టాటా జీ.. భారతదేశం మిమ్మల్ని మిస్ అవుతుంది.. మీ వినయం, మీ కరుణ మరియు మీ నాయకత్వం .. శాంతితో ఇక విశ్రాంతి తీసుకొండి మీ కీర్తి అజరామరం.. అంటూ పోస్టు చేశారు. రతన్ టాటా గారి మరణం మన జాతికి ఎంతో పెద్ద నష్టం అతనో ఐకానిక్ లెజెండ్, మార్గదర్శి. సామాన్యుడి నుండి వ్యాపార మార్గదర్శకుల వరకు చాలా మంది జీవితాలకు స్పూర్తినిచ్చారు. ప్రజలను ప్రేమించే పరోపకారి.. రతన్ టాటా సర్ వారసత్వం లక్షలాది మంది హృదయాల్లో నిలిచి ఉంటుంది అంటూ రామ్ చరణ్ పోస్టు చేశారు.

Also Read : Chiranjeevi : రతన్ టాటా మృతిపై తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేసిన చిరంజీవి

akkineni nagarjunapawan kalyanRatan TataUpdatesViral
Comments (0)
Add Comment