తెలుగు వెండి తెరపై ఆయన పేరు చెబితే చాలు పూనకాలు వచ్చేస్తాయి. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు. అతడు ఎవరో కాదు పవన్ కళ్యాణ్. స్వయాన మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు. నాగేంద్రబాబుకు సోదరుడు.
ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించాడు. దానికి చీఫ్ గా ఉన్నాడు. ఏపీపై ఫోకస్ పెట్టాడు. నటుడిగా సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఆపై పార్టీ పరంగా దుమ్ము రేపుతున్నాడు.
పవన్ కళ్యాణ్ సినిమా రంగంలోకి అనుకోకుండా వచ్చాడు. ఆయన ఈ రంగంలోకి వచ్చి 27 ఏళ్లవుతోంది. ఆయనను ప్రేమించే అభిమానులు సుదీర్ఘ ప్రయాణం పవనిజం అని పేరు పెట్టారు. ఇవాళ వరల్డ్ పవనిజం డే అంటూ హోరెత్తిస్తున్నారు. ఎవరి అభిమానం వారిది. మనోడి మేనరిజం డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన డైలాగులు భిన్నంగా ఉంటాయి.
ఆయన చేసే ప్రతి సినిమాకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందనే దానిపై ఇంకా బయటకు రాలేదు. కానీ కోట్లల్లో ఉంటుందని అది వంద కోట్లకు పైమాటేనని ప్రచారం జరుగుతోంది. ఇది పక్కన పెడితే తను నటనకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు.
ఆయన ఆ మధ్యన నటించిన గబ్బర్ సింగ్ మూవీలో చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా కొనసాగుతోంది. నాకో తిక్కుంది దానికో లెక్కుంది అని. కేవలం తన కోసమే తాను రాశానని అన్నాడు హరీశ్ శంకర్.