Pavitranath : ప్రముఖ బుల్లితెర సీరియల్ నటుడు పవిత్రనాథ్ మృతి

పవిత్ర నాథ్ గురించి ఇంద్రనీల్ భార్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది

Pavitranath : టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సీరియళ్ళలో “మొగలిరేకులు(Mogali Rekulu)” ఒకటి. ఈ సీరియల్‌లో ‘దయా’ పాత్రలో నటించి అందరికీ సుపరిచితుడైన పవిత్ర నాథ్ కన్నుమూశారు. తోటి నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో ప్రకటన చేయడంతో ఇది అందరి దృష్టికి వచ్చింది. “ఈ వార్త నిజం కాకపోతే చాలా బాగుంటుంది. నువ్వు ఇలా మమ్మల్ని వదిలి వెళ్లడం చాలా బాధగా ఉంది నీకు కనీసం వీడ్కోలు కూడా చెప్పలేకపోయం” అంటూ పోస్ట్ పెట్టారు.

Pavitranath No More

పవిత్ర నాథ్ గురించి ఇంద్రనీల్ భార్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, అయితే పవిత్ర నాథ్ ఎలా మరణించాడు మరియు ఏమి జరిగిందో స్పష్టంగా తెలియలేదు. పవిత్రనాథ్ ‘చక్రవాకం’ సీరియల్లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అతని యొక్క ఈ రెండు సిరీస్‌లు అత్యంత ప్రాచుర్యం పొందాయి, వీక్షకులు నటీనటుల అసలు పేర్ల కంటే పాత్రల పేర్లే ఎక్కువగా గుర్తుండిపోతాయని చెప్తున్నారు.

ఈ రెండు సీరియళ్ళలో పవిత్రనాథ్ ఇంద్రనీల్ తమ్ముడిగా నటించాడు. ప్రస్తుతం ఇంద్రనీల్ భార్య మేఘన పెట్టిన పోస్ట్‌పై అభిమానులు స్పందిస్తున్నారు. అసలు దయా (పవిత్ర నాథ్) ఏమయ్యాడు, ఎందుకు ఇలా చేసాడు అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. గతంలో పవిత్రనాథ్ పై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Also Read : Nayanthara : భర్తను అన్ ఫాలో చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నయనతార

ActorCommentsDeathsViral
Comments (0)
Add Comment