Passion : సుధీష్ వెంకట్, అంకిత సాహా, శ్రేయసి షా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ప్యాషన్. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. బిఎల్ఎన్ సినిమా మరియు రెడ్ యాంట్ క్రియేషన్స్ బ్యానర్‌పై Dr. అరుణ్ కుమార్ మొండిసోకా, నరసింహ యెర్రే మరియు ఉమేష్ చికు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జాషువా తెలుగు సినిమా ప్యాషన్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నారు. అరవింద్ జాషువా శేఖర్ కమ్ముల, మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి వంటి స్టార్ డైరెక్టర్ల దగ్గర పనిచేశాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్‌లోని కొన్ని ఫ్యాషన్ కాలేజీల్లో 20 రోజుల పాటు తొలి షెడ్యూల్‌ను చిత్రీకరించారు. రెండో షెడ్యూల్ కోసం చిత్రబృందం సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు.
Passion Movie Updates
ఈ సందర్భంగా దర్శకుడు అరవింద్ జాషువా మాట్లాడుతూ: హైదరాబాద్‌లోని పలు ఫ్యాషన్ స్కూల్స్‌లో 20 రోజుల పాటు సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించి ప్రస్తుతం రెండో దశకు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్యాషన్ పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా సమగ్రమైన, ప్రత్యేక పరిజ్ఞానంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ తరహాలో వచ్చిన తొలి భారతీయ సినిమా ప్యాషన్ అని చెప్పొచ్చు. ప్రేమ, ఆకర్షణపై యువతలో ఉండే అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.
Also Read : Prasanna Vadanam OTT : ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సుహాస్ ‘ప్రసన్న వదనం’