Parvathy Nair: ఇటీవల విడుదలైన దళపతి విజయ్ ‘ద గోట్’ సినిమాలో కీలక పాత్రలో నటించిన పార్వతి నాయర్‌పై పోలీస్ కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం గొడవ మళ్లీ తెరపైకి రావడంతో పార్వతి, మరో నిర్మాత సహా మొత్తంగా ఐదుగురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు తేనాంపేట పోలీసు స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. దుబాయిలో పుట్టి పెరిగిన పార్వతి నాయర్… మలయాళ సినిమాలతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో చేయనప్పటికీ ఎంతవాడు గానీ, ఉత్తమ విలన్, ద గోట్ వంటి డబ్బింగ్ చిత్రాలతో అలరించింది.
Parvathy Nair – రెండేళ్ళ క్రితం జరిగింది ?
2022 అక్టోబరు 20న తన ఇంట్లో దొంగతనం జరిగిందని పార్వతి నాయర్(Parvathy Nair) నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. తన దగ్గర పనిచేసే సుభాష్ చంద్రబోస్.. రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, లక్షన్నర ఖరీదైన ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్ ట్యాప్ దొంగతనం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రతిగా ఈమెపై సుభాష్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. పార్వతి నాయర్… తనని కొట్టి, మానసిక క్షోభకు గురిచేసిందని, తిరిగి దొంగతనం కేసు పెట్టిందని చెప్పాడు.
ఇప్పుడేం జరిగింది ?
అప్పుడు సుభాష్… తేనాంపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనితో తాజాగా సైదాపేట కోర్టులో కేసు వేశాడు. ఆమెతో పాటు మరికొందరు తనపై దాడి చేశారని వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తనని ఇబ్బంది పెట్టారని తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని వాపోయాడు. ఈ కేసు పరిశీలించిన స్థానిక కోర్ట్.. చర్యలు తీసుకోవాలని పోలీసులని ఆదేశించింది. ఈ క్రమంలోనే నటి పార్వతి నాయర్, నిర్మాత కొడప్పాడి రాజేశ్ తో పాటు మరో ముగ్గురిపై తేనాంపేట పోలీసు స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Also Read : Teeangers: ట్రెండింగ్ లోనికి కన్నడ సూపర్ హిట్ మూవీ ‘టీనేజర్స్ 17/18’ !