Parineeti Chopra: లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి శుద్ధ్ దేశీ రోమాన్స్ తో సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా. చివరిగా అక్షయ్ కుమార్ తో కలిసి మిషన్ రాణిగంజ్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ… గతేడాది తన ప్రియుడు, ఆప్ ఎంపీ రాఘవచద్దాను పెళ్లాడింది. సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చి… ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ భామ తన అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.
సినిమాల్లో హీరోయిన్ గా అలరించిన పరిణీతి(Parineeti Chopra)… ప్రస్తుతం సింగర్‌గా మారిపోయింది. తన జీవితంలో సరికొత్త అధ్యాయం మొదలైందంటూ స్టూడియోలో పాట పాడుతున్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఆమె నటించిన రొమాంటిక్ మూవీ ‘మేరీ ప్యారీ బిందు’ సినిమాలోని ‘మాన కే హమ్ యార్ నహీ’ అనే పాటను పాడుతున్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. గతంలో ఆమె అక్షయ్ కుమార్ తో నటించిన ‘కేసరి’ సినిమాలోని ‘తేరి మిట్టి’ మహిళా వర్షన్‌ను అలపించింది.
Parineeti Chopra Singing Video Viral
ఈ సందర్భంగా పరిణీతి తన ఇన్‌స్టాలో రాస్తూ… ‘నాకు సంగీతం ఎప్పటికీ సంతోషకరమైన ప్రదేశం. నా జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఒకేసారి రెండు కెరీర్‌లు చేసుకునే అవకాశం కల్పించిన ఈ ప్రయాణం ఎంతో సరదాగా ఉంది. అందుకే ఇక్కడ నాకు తెలియని వాటిని నేర్చుకోవడం, నాలో భయాలన్నింటినీ తొలగించుకుని… నా తొలి గానం ప్రారంభించా. దీనికోసం నేను ఉత్తమ సంస్థతో చేతులు కలిపా. ఈ ఏడాది మొత్తం మీ కోసం కొన్ని అద్భుతాలు సృష్టించబోతున్నా. మీరు కూడా దీని కోసం నాలాగే ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను’ అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పరిణీతి పాడిన ఈ పాట’మాన కే హమ్ యార్ నహీ’ అనే పాట ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఆమె నటించిన 2017 రొమాంటిక్ మూవీ ‘మేరీ ప్యారీ బిందు’ చిత్రంలోనిది.
Also Read : Rashmika Mandanna: చీర కట్టు, పులి గోరుతో రష్మిక లుక్ అదుర్స్ !