Parineeti Chopra: లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి… శుద్ధ్ దేశీ రోమాన్స్ తో సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా. చివరగా అక్షయ్ కుమార్ తో కలిసి మిషన్ రాణిగంజ్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ… తన ప్రియుడు, ఆప్ ఎంపీ రాఘవచద్దాను పెళ్లాడింది. గతేడాది మేలో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ… సెప్టెంబరులో పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో దాదాపు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వీరి పెళ్లి వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చి… కొన్ని రోజుల పాటు మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేసిన ఈ ముద్దుగుమ్మ… ప్రస్తుతం అమర్ సింగ్ చమ్కీలా అనే సినిమాలో నటిస్తోంది. దిల్జీత్ దోసాంజ్ సరసన నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ లో వైట్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసింది పరిణీతి చోప్రా.
Parineeti Chopra Good News
అయితే ఎయిర్ పోర్ట్ లో పరిణీతి చోప్రా వేసుకున్న అవుట్ ఫిట్ చూసి నెట్టింట ఓ ఆశక్తికరమైన చర్చ జరుగుతోంది. చాలా తేలికగా ఉండే… వైట్ కలర్ అవుట్ ఫిట్స్ తో పరిణీతి కనిపించడంతో ఆమె తల్లి కాబోతుందనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతోంది. అయితే అవుట్ ఫిట్స్ చూసి ప్రెగ్నెన్సీ డిసైట్ చేస్తే ఎలా అంటూ మరికొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. సినిమా పీల్డ్ లో గ్లామర్ కు ప్రాధాన్యం ఇవ్వడం సర్వసాధారణం. కాబట్టి సినిమా హీరోయిన్స్ కాస్తా ఆలస్యంగా పిల్లలను ప్లాన్ చేసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో ఆలియా భట్ వంటి తారలు పెళ్ళైన వెంటనే పిల్లలను ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యం పరిణీతి చోప్రా(Parineeti Chopra)… రాజకీయ నాయకుడ్ని చేసుకోవడంతో ఆమె కూడా పిల్లలను త్వరగానే ప్లాన్ చేసుకుంటుంది అనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై పరిణీతి చోప్రా ఇంత వరకు స్పందించలేదు. ఆమె ప్రెగ్నెన్సీ అంటూ వస్తోన్న రూమర్స్ పై స్పందిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read : Sini Shetty: మిస్ వరల్డ్ ఫైనల్స్ రేసులో ఇండియన్ బ్యూటీ !