Parineeti Chopra: లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి శుద్ధ్ దేశీ రోమాన్స్ తో సినిమాతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా. చివరగా అక్షయ్ కుమార్ తో కలిసి మిషన్ రాణిగంజ్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ… గతేడాది తన ప్రియుడు, ఆప్ ఎంపీ రాఘవచద్దాను పెళ్లాడింది. సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చి… ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ భామ తన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంతకాలం సినిమాల్లో హీరోయిన్ గా అలరించిన పరిణీతి… ప్రస్తుతం సింగర్‌గా మారిపోయింది. తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న పరిణీతి తనకి ఈ సినిమాలో పాటలు పాడే అవకాశం ఎలా వచ్చిందో తెలిపింది. దీనిలో భాగంగా ఆమె ఆడిషన్స్ లో ఎప్పుడు, ఎక్కడ, ఎలా పాల్గొంది అనే విషయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Parineeti Chopra singing Viral
ఇటీవల ఓ వేడుకలో పరిణీతి చోప్రా మాట్లాడుతూ…. ‘రెండేళ్ల క్రితం నేను కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకకు వెళ్తున్న సమయంలో దర్శకుడు ఇంతియాజ్ అలీ నుంచి ఫోన్ వచ్చింది. ‘దిల్జీజ్, రెహమాన్ కూడా జూమ్ కాల్లో ఉన్నారు. మీతో ఇప్పుడు మాట్లాడవచ్చా ? అని అడిగారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న నేను కారులో ఉన్నవాళ్లని నిశ్శబ్దంగా ఉండమన్నాను. ఊపిరి కూడా పీల్చుకోలేనంత నిశ్శబ్దం చుట్టుముట్టింది. పాటలు పాడటం తెలుసా ? అని రెహమాన్ సర్ అడిగితే… పాడటం అంటే ఇష్టమని చెప్పా. ఆ జూమ్ కాల్లో ‘దమా దమ్ మస్త్ కలందర్’ అనే పాటని పాడమన్నారాయన.
వారికి నచ్చింది. అందులో నటనతోనే కాదు… పాటలు పాడటంలో కూడా భాగమవుతున్నానని అప్పుడే అర్థమైంది’ అంటూ గుర్తుచేసుకుంది పరిణీతి(Parineeti Chopra). ‘ప్రకాశవంతంగా మెరిసే రంగీలా… అతడే మన అమర్ సింగ్ చమ్కీలా..’ అంటూ ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘ప్రజలు ఎలాంటి పాటలు వినాలనుకుంటున్నారో నాకు తెలుసు. వారికి ఆ ఆనందాన్ని నేనివ్వగలను. మేము గాయకులం. పాడటమే మా పని’ లాంటి సంభాషణలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఏప్రిల్ 12న ఓటీటీలో విడుదల కానుంది.
Also Read : Bobby Deol: అలియా స్పై యాక్షన్ ఫిల్మ్ లో విలన్ గా బాబీ డియోల్ ?