Yash : కన్నడ సూపర్ స్టార్ యశ్ సంచలనంగా మారారు. తను ప్రస్తుతం టాక్సిక్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు డైరెక్టర్. గోవాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీతో ఓ పాటను చిత్రీకరించారు. ప్రస్తుతం బెంగళూరు వేదికగా మరికొన్ని సీన్స్ చిత్రీకరించే పనిలో పడ్డారు.
Yash Toxic Movie Updates
టాక్సిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశంలో సినీ రంగానికి సంబంధించి అత్యంత జనాదరణ పొందిన నటుల్లో టాప్ లో కొనసాగుతున్నాడు యశ్(Yash). తను ఎక్కువగా వేరే విషయాల గురించి పట్టించుకోడు. తను ప్రాజెక్టు ఒప్పుకున్నాడంటే అందులో లీనమై పోతాడు. షూటింగ్ అయి పోయాక ఇంటికి వెళ్లి పోతాడు. తన భార్య, పాపతో సమయం గడిపేందుకు ఇష్ట పడతాడు.
కన్నడ సినీ రంగంలో యశ్ వెరీ వెరీ స్పెషల్. ప్రస్తుతం టాక్సిక్ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ దుమ్ము రేపుతోంది. కేజీఎఫ్ మూవీతో లక్షలాది మందిని తన వైపు తిప్పుకునేలా చేసిన ఈ హీరో ఇప్పుడు న్యూ రోల్ ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉండడం విశేషం. కియారా అద్వానీ, నయనతారతో పాటు డారెల్ డిసిల్వా నటిస్తున్నారు. దీనికి గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. టాక్సిక్ ను ఈ ఏడాది చివరలో విడుదల చేయాలని మూవీ మేకర్స్ డిసైడ్ అయ్యారు.
Also Read : Beauty Kiara Advani : టాక్సిక్ షూటింగ్ లో కియారా బిజీ