Sobhita Dhulipala : శోభితా ధూళిపాళ భారతదేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులకు సుపరిచితం. తెరపై అద్భుతమైన ప్రెజెన్స్ ఉన్న హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ప్రస్తుతం హాలీవుడ్‌లో సినిమాలు చేస్తుంది. శోభిత పలు తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. మోడలింగ్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఓ స్టార్ ఇప్పుడు సినీ ప్రపంచంలో హీరోయిన్ గా రాణిస్తోంది.
Sobhita DhuliSobhita Dhulipala
ఈ ఏడాది ప్రారంభంలో, దేవ్ పటేల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మంకీ మ్యాన్’తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శోభిత ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పటికే నటిగా తనని తాను నిరూపించుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. శోభిత తన యుక్తవయస్సులో ముంబైలో కార్పొరేట్ న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యసించింది, వార్షిక నేవీ హర్ బాల్ హర్ పిన్ 2010లో నేవీ క్వీన్‌గా ఎంపికైంది. 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో ఆమె పరిశ్రమలోకి ప్రవేశించింది. విక్కీ కౌశల్ సరసన స్మృతికా నాయుడు నటించింది. తొలి సినిమాతోనే నటిగా రాణిస్తున్న శోభిత ఆ తర్వాత సినిమాల్లో రాణిస్తూనే ఉంది.
Also Read : Chiranjeevi : యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న పద్మవిభూషణుడు