Kareena Kapoor : బాలీవుడ్ నటిపై పాక్ నటుడు కీలక వ్యాఖ్యలు

కాగా షానవాజ్‌ ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్నాడు...

Kareena Kapoor : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కరీనా కపూర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 44 ఏళ్ల వయసులోనూ ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ‘జబ్ వి మెట్’, ‘గుడ్‌న్యూస్’, ‘వీరే ది వెడ్డింగ్’, ‘ఉడ్తా పంజాబ్’, ‘బజరంగీ భాయిజాన్’, ‘బాడీగార్డ్’, ‘గోల్‌మాల్ 3’ ‘క్రూ’ తదితర సినిమాలు కరీనా(Kareena Kapoor) క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ఇక పెళ్లై, ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన తర్వాత కూడా హీరోయిన్ ఆఫర్లు అందుకుంటోందీ ముద్దుగుమ్మ. అలాగే సోషల్ మీడియాలోనూ ఆమెకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

దానికి కారణం ఆమె ఫిట్ నెస్ అండ్ ఫ్యాషన్ సెన్స్. చాలా మంది పెద్ద ఆర్టిస్టులు కరీనాతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో కరీనా(Kareena Kapoor)పై ఓ పాకిస్థానీ ప్రముఖ నటుడు చేసిన ప్రకటన ఆమె అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఖాకాన్ షానవాజ్ పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ నటుడు. 27 ఏళ్ల ఈ క్రేజీ యాక్టర్ చాలా సినిమాలు వెబ్ సిరీస్‌లలో నటించాడు. అలాగే కొన్ని రియాల్టీ షోలలో కూడా పాల్గొన్నాడు. ఇక సోషల్ మీడియాలోనూ షానవాజ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. కాగా షానవాజ్‌ ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. మీరు కరీనా కపూర్‌తో నటిస్తే చూడాలనుందని మనసులో మాట బయటపెట్టాడు.

Kareena Kapoor…

దీనికి స్పందించిన పాకిస్తానీ నటుడు.. ‘అవునా.. సరే, నేను ఆమెకు కుమారుడిలా నటిస్తాను. అలాంటి ఆఫర్‌ వస్తే కచ్చితంగా చేస్తాను. నా కంటే కరీనా వయసులో చాలా పెద్దది. కాబట్టి నేను కేవలం ఆమెకు కుమారుడిగా మాత్రమే యాక్ట్ చేయగలను’ అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కరీనా కపూర్‌ ఫ్యాన్స్‌ పాక్ నటుడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. .’పాకిస్థానీ నటులు భారత్‌లో సినిమాలు చేయడానికి వీలు లేదు లే బ్రో’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. కరీనా కపూర్ 2000లో తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించింది. తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడామె వయసు సుమారు 44 సంవత్సరాలు. అయినా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే కరీనాపై కామెంట్స్ చేసిన మరియు ఖాకాన్‌ షానవాజ్ వయసు సుమారు 27 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ సుమారు 17 సంవత్సరాలన్నమాట.

Also Read : Dil Raju : టికెట్ రేట్ల పెంపుపై స్పందించిన నిర్మాత దిల్ రాజు

CommentsKareena KapoorPakistan ActorViral
Comments (0)
Add Comment