Hero Prabhas : ప్రభాస్ సినిమాకు హీరోయిన్ గా పాకిస్తాన్ హీరోయినా..?

2024 నాటికి ఆమె నికర విలువ $8 మిలియన్...

Hero Prabhas : బాబోయ్.. అమ్మాడి బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా.. ప్రభాస్ సరసన పాకిస్థాన్ హీరోయిన్.. ఆస్తులు ఎంతంటే. ఇటీవలే కల్కి 2898 ఏడి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్నాడు ప్రభాస్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో సంచలనం సృష్టిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్రభాస్(Hero Prabhas) తన నెక్ట్స్ మూవీస్ షూటింగ్స్ అంటూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో లవ్, యాక్షన్ మూవీ చేయనున్నట్లు ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈసినిమాలో పాకిస్తాన్ హీరోయిన్ సజల్ అలీ కథానాయికగా నటించనుందట. ఈ బ్యూటీ ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. శ్రీదేవితో కలిసి 2017 థ్రిల్లర్ “మామ్”తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సజల్ అలీ మళ్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారనే ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

Hero Prabhas…

సజల్ అలీ 2009లో జియో టీవీ యొక్క సిట్‌కామ్ నాదానియాన్‌తో వినోద ప్రపంచంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. “ సిన్ఫ్-ఎ-ఆహాన్,” “ఇష్క్-ఎ-లా,” “యే దిల్ మేరా”తో సహా అనేక ప్రసిద్ధ పాకిస్తానీ సిరీస్ చేసింది. సజల్ పాకిస్థానీ వినోద పరిశ్రమలో అత్యధిక పారితోషికం మరియు సంపన్న నటీమణులలో ఒకరు. ఆమె తన డ్రామా పాత్రల కోసం ఒక ఎపిసోడ్‌కు లక్ష రూపాయలు వసూలు చేస్తుంది. 2024 నాటికి ఆమె నికర విలువ $8 మిలియన్. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.66 కోట్లు ఉన్నట్లు సమాచారం. సజల్ ప్రస్తుతం తన కొత్త పాకిస్థానీ డ్రామా “జర్డ్ పాటన్ కా బన్”లో హంజా సోహైల్‌తో కలిసి నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ సరసన సజల్ అలీ నటిస్తుందని వార్తలు వినిపించడంతో నెట్టింట ఈ అమ్మడి పేరు తెగ ట్రెండ్ అవుతుంది. ఈ బ్యూటీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Also Read : Ram Charan : రామ్ చరణ్ తో సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చిన కృష్ణవంశీ

PrabhasTrendingUpdatesViral
Comments (0)
Add Comment