Padmavibhusan Chiranjeevi: పద్మవిభూషణుడికి సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ ‘చిరు’ సత్కారం !

పద్మవిభూషణుడికి సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ ‘చిరు’ సత్కారం !

Padmavibhusan Chiranjeevi: ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఆహా సంస్థలు సంయుక్తంగా శుక్రవారం హైదరాబాద్‌ లో సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ ని ఘనంగా నిర్వహించాయి. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ప్రముఖ కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. దేశ రెండోఅత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌ గౌరవం పొందిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని(Padmavibhusan Chiranjeevi)… సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ నిర్వాహకులు ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మణిశర్మ, తనికెళ్ల భరణి, టీజీ విశ్వప్రసాద్‌, మురళీమోహన్‌, అల్లు అరవింద్‌, కె.ఎస్‌.రామారావు, టీజీ వెంకటేశ్‌తో పాటు పలు భాషలకి చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Padmavibhusan Chiranjeevi In…

దేశంలో రెండో అత్యున్నత పురస్కారం అందుకున్న చిరంజీవిని ఇప్పటికే పలు వేదికలపై సత్కరించారు. గత నెలలో లాస్‌ ఏంజిల్స్‌లో తెలుగు అభిమానులు కూడా చిరును ఘనంగా సన్మానించారు. అమెరికాలోని మెగా ఫ్యాన్స్ ‘మెగా ఫెలిసిటేషన్‌ ఈవెంట్‌’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి చిరుని గౌరవించారు. చిరంజీవికి అవార్డు వచ్చిన సమయంలో ఆయనకు ఇండస్ట్రీ తరఫున సన్మానించబోతున్నాం అని పెద్దలు ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా కార్యాచరణ జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ… “జాతీయ ఉత్తమనటుడు అవార్డుని అందుకున్న అల్లు అర్జున్‌ ని చిత్రసీమ సన్మానించకుండా వదిలేసింది. ఇప్పుడు మెగాస్టార్ ని అయినా సన్మానిస్తున్నారు సంతోషం. ఒకప్పుడు ఇలా ఉండేది కాదంటూ” కామెంట్ చేసారు. ప్రస్తుతం మురళీమోహన్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Also Read : SS Rajamouli: జపాన్ ప్రేక్షకుల అభిమానానికి రాజమౌళి ఫిదా !

Mega Star ChiranjeeviPadma Vibhushan
Comments (0)
Add Comment