Vishwambhara : అందరి కళ్లు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవిపై ఉన్నాయి. తన వయసు పెరుగుతున్నా ఇంకా కుర్ర హీరో, హీరోయిన్లతో పోటీగా నటిస్తున్నారు. మరో వైపు తనయుడు రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఆర్సీ16 షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో కీ రోల్ పోషిస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్. ఇక చిరంజీవి విషయానికి వస్తే విశ్వంభర(Vishwambhara) మూవీ షూటింగ్ పూర్తయింది. రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ఫోకస్ పెట్టారు. పీరియాడికల్ బేస్ తో తీస్తున్నాడు దర్శకుడు మల్లిడి వసిష్ట.
Vishwambhara Movie OTT Focus
బుల్లెట్ లకంటే బలంగా డైలాగులు రాసే దమ్మున్న రచయిత బుర్రా సాయి మాధవ్ విశ్వంభరకు రాస్తుండడం విశేషం. ప్రమోద్ ఉప్పలపాటి , వంశీ కృష్ణా రెడ్డి, విక్రమ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు త్రిష కృష్ణన్ , సురభి, హర్ష వర్దన్ , వెన్నెల కిషోర్ , ప్రవీణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా విశ్వంభర సినిమాకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. వాస్తవానికి సంక్రాంతికే ఇది విడుదల కావాల్సి ఉంది. కానీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ సరిగా రాక పోవడంతో వాయిదా వేశారు. ప్రస్తుతం జురాసిక్ పార్క్ మూవీ కోసం పని చేసిన వారితో మరోసారి సినిమాను సరి చేసే పనిలో పడ్డారని వినికిడి. మొత్తంగా ప్రస్తుతం ఐపీఎల్ కొనసాగుతోంది. ఇది రెండు నెలల పాటు ఉంటుంది. బహుశా వచ్చే జూన్ లేదా జూలై నెలల్లో విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిని దక్కించుకునేందుకు ఓటీటీలు పోటీ పడుతుండడం విశేషం.
Also Read : Popular Actor Raghuvaran : రఘు వరన్ జర్నీ డాక్యుమెంటరీ