Oscars 2025 : 97వ ఆస్కార్ (Oscars 2025) అవార్డుల నామినేషన్స్ కార్య్కమాలకు రంగం సిద్దమైంది. ఈ వేడుక మార్చి 2, 2025న జరుగుతుందని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(Oscars) ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని దేశాలు తమ అధికారిక ఎంట్రీలను ప్రకటించగా మరికొన్ని దేశాలు ఉత్తమ చిత్రాలను సెలక్ట్ చేసుకునే ప్రక్రియలో బిజీగా ఉన్నాయి. అయితే మన దేశం నుంచి అధికారిక ఎంట్రీని పంపించేందుకు షార్ట్ లిస్ట్ రెడీ చేసి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ భాషలకు చెందిన చిత్రాల స్క్రీనింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో తెలుగు నుంచి ప్రభాస్ కల్కి, ప్రశాంత్ వర్మ హనుమాన్, అజయ్ భూపతి మంగళవారం సినిమాలు ఉండగా తమిళం నుంచి తంగలాన్, వాజై, కొట్టుకాళి, మహారాజ, జమా, జిగర్తాండ డబల్ ఎక్స్, మలయాళం నుంచి ఊళ్ళోజుక్కు, ఆడు జీవితం, ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్, ఆట్టం, మరాఠీ నుంచి స్వరగంధర్వ సుధీర్ ఫడకే, ఘాట్, ఘరత్ గణపతి హిందీ నుంచి కిల్, ఆర్టికల్ 370, షామ్ బహదూర్, గుడ్ లక్, జోరం, ఆనిమల్, శ్రీకాంత్, వీర్ సవార్కర్, చోటా భృమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యం, లా పట్టా లేడిస్, చందు చాంఫియన్ వంటి సినిమాలు లిస్టులో ఉన్నాయి.
Oscars 2025 Updates
అయితే మొత్తంగా తెలుగు నుంచి 3, తమిళం నుంచి 6, మలయాళం నుంచి 4, మరాఠీ నుంచి 3, హిందీ నుంచి 11 సినిమాలు ఇండియా నుంచి పంపిచే చిత్రాల జాబితాలో ఉన్నాయి. వీటిలోంచి ఓ ఉత్తమ చిత్రాన్ని ఫిల్టర్ చేసి ఆస్కార్(Oscars) నామినేషన్‌కు పంపించేందుకు సిద్దం చేస్తారు. కాగా ఈ సోమవారం మధ్యాహ్నం 12 తర్వాత అస్కార్‌కు ఇండియా నుంచి నామినేట్ చేసిన చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కాగా దేశ చరిత్రలో ఎన్నడు లేనంతగా ఈ సారి కల్కి, లా పట్టా లేడీస్, చందూ చాంపియన్, తమిళ, మలయాళం నుంచి వచ్చిన చిత్రాలలో చాలా వాటికి ఆస్కార్ అర్హత ఉందని దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఎవరికి వారు ఈ చిత్రానికి తప్పనిసరిగా అవార్డు వస్తుంనదని ఇప్పటినుంచే అంచనాలు వేసుకోవడం విశేషం. అయినప్పటికీ అందరి చూపు లా పట్టా లేడిస్, ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్ చిత్రాలపైనే ఉన్నాయి.
ఇదిలాఉండగా మహిళా దర్శకురాలు పాయల్ కపాడియా డైరెక్షన్‌లో మలయాళం, హిందీ, మరాఠీ భాషలలో రూపొంది షూటింగ్ మొత్తం ముంబైలోనే జరిగిన చిత్రం ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్. అయితే ఇండియా, నెదర్లాండ్స్, లక్షంబర్గ్, ఇటలీ దేశాల ప్రోడక్షన్ కంపెనీలు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఫ్రాన్స్ దేశం తమ అస్కార్స్ అధికారిక ఎంట్రీ చిత్రంగా సెలక్ట్ చేయడం గమనార్హం. ఇప్పటికే ఈ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో రెండు ఆవార్డులు గెలుచుకుని చరిత్ర సృష్టించగా ఇంకా సిడ్నీ, చికాగో ఫిలిం ఫెస్టివల్స్‌కు కూడా నామినేట్ అవడం అరుదైన విషయం. ఇక మన పొరుగు దేశమైన నేపాల్ నుంచి శంబలా అనే చిత్రాన్ని అస్కార్స్ నామినేషన్‌కు పంపించడం విశేషం.
Also Read : Swag: శ్రీవిష్ణు ‘శ్వాగ్’ నుండి కైలాష్ ఖేర్ పాడిన ఇంగ్లాండు రాణి సాంగ్ రిలీజ్ !