Oscars 2025 : ఆస్కార్ రేసు నుంచి తప్పుకున్న ‘లపతా లేడీస్’

అయితే 2025 ఆస్కార్ రేసు నుంచి ఈ సినిమా ఔట్ అయ్యింది...

Oscars 2025 : బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా లాపతా లేడీస్(Laapataa Ladies). బీటౌన్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అన్నివర్గాల నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇందులో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్ కీలకపాత్రలు పోషఇంచారు. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ అవార్డులలో క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. అలాగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తోపాటు.. సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకలో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని సి బ్లాక్ లోని ఆడిటోరియంలో ప్రదర్శించడం విశేషం. ఇక ఈసారి ఆస్కార్ 2025 అవార్డు పోటీలకు భారత్ నుంచి ఎంపికైంది.

Oscars 2025 Updates

అయితే 2025 ఆస్కార్(Oscars 2025) రేసు నుంచి ఈ సినిమా ఔట్ అయ్యింది. టాప్ 10లో స్థానం సాధించడంలో విఫలమైంది. ఉత్తమ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ విభాగంలో షార్ట్ లిస్ట్ చేసిన ఈ టాప్ 10 సినిమాల జాబితాలో లాపతా లేడీస్ పేరు లేదు. దీంతో అధికారికంగా ఈ సినిమా ఆస్కార్ రేసు నుంచి తప్పుకుంది. ఈ లిస్ట్ లో బ్రెజిల్, కెనడాకు చెందిన చిత్రాలు నిలిచాయి. అయితే ఆస్కార్‌ అవార్డుల రేసులోకి హిందీ సినిమా “సంతోష్‌” షార్ట్‌లిస్ట్‌ అయింది. ఉత్తమ విదేశీ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఈ సినిమా షార్ట్‌లిస్ట్‌ అయింది. భారత్‌ నుంచి కాకుండా UK నుంచి వెళ్లింది ఈ సినిమా. ఇప్పటికే 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రశంసలు అందుకుంది.

ఉత్తరభారతంలోపరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమాను నిర్మించారు. సంతోష్‌ అనే మహిళకు తన భర్త చేస్తున్న పోలీసు ఉద్యోగం వస్తుంది. భర్త చనిపోవడంతో ఈ ఉద్యోగం ఆమెకు వస్తుంది. అట్టడుగు వర్గానికి చెందిన ఒక బాలిక హత్యకేసు దర్యాప్తులో భాగంగా అవినీతి వ్యవస్థతో ఆమె ఎలా పోరాడిందనే కథాంశంతో ఈ సినిమాను దర్శకురాలు సంధ్యా పురి తెరకెక్కించారు. ఈ సినిమాకు అవార్డు వస్తుందో రాదో మార్చి మూడోతేదీన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో తేలిపోతుంది.

Also Read : Shivangi Verma : 70 ఏళ్ల నటుడితో ప్రేమలో పడ్డ 31 ఏళ్ల బాలీవుడ్ నటి

Laapataa LadiesOscar AwardsUpdatesViral
Comments (0)
Add Comment