Godzilla Minus one : హాలీవుడ్‌లో గాడ్జిల్లా సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది. తెలుగులోనూ ఈ సినిమాలకు చాలా మంది అభిమానులున్నారు. గాడ్జిల్లా సిరీస్‌లో చాలా సినిమాలు వచ్చాయి. సూపర్ హిట్స్. ఇదే సిరీస్‌లో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మరో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ గాడ్జిల్లా మైనస్ వన్(Godzilla Minus One). గత సంవత్సరం విడుదలైన ఈ జపనీస్ చిత్రంలో మియామి హమాబ్, ర్యునోసుకే కమికి మరియు యుకీ తోడా నటించారు. తకాషి యమజాకి దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్ 3న విడుదలైన ఈ సినిమా జపాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఆస్కార్‌లో కూడా తన సత్తా చాటింది.
“ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్” విభాగంలో, గాడ్జిల్లా మైనస్ వన్ ఒక హాలీవుడ్ చిత్రాన్ని ఓడించి విజేతగా నిలిచింది. అయితే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇండియాలో మాత్రం థియేటర్లలో విడుదల కాలేదు. దీంతో భారతీయ ప్రేక్షకులు ఈ చిత్రం OTTలో విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం ఎటువంటి హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా OTTలోకి ప్రవేశించినందున నిరీక్షణ ముగిసింది. గాడ్జిల్లా మైనస్ వన్ చిత్రం ఇప్పుడు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అధికారికంగా వెల్లడించింది.
Godzilla Minus one OTT Updates
అయితే, ప్రస్తుతం గాడ్జిల్లా మైనస్ వన్ చిత్రం జపనీస్, ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ప్రసారం అవుతోంది. అయితే ఈ సినిమాని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడవచ్చు. తెలుగులో ప్రసారం చేసే ఎంపిక కూడా త్వరలో జోడించబడుతుంది. గాడ్జిల్లా మైనస్ వన్ అనేది 1945లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే చారిత్రక నాటకం. అణు బాంబు కారణంగా హిరోషిమా మరియు నాగసాకి విధ్వంసానికి కల్పిత కథను జోడించి మేకర్స్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆకట్టుకునే కథాంశం, కళ్లు చెదిరే గ్రాఫిక్స్ ఈ సినిమా విజయానికి ఎంతగానో దోహదపడ్డాయి.
Also Read : Prabhas : ప్రభాస్ ఆ యంగ్ హీరోకు అంత కాస్ట్లీ కార్ ఇచ్చాడా..!