Popular Oscar Awards 2025 :అంత‌టా ‘అనోరా’ ఏమిటా క‌థ‌

ఓటీటీల్లో సినిమా సంచ‌ల‌నం 

Oscar Awards : యావ‌త్ ప్ర‌పంచం ఒక్క‌సారిగా విస్తు  పోయింది. ఏమిటి..ఓ వేశ్య క‌థను తెర‌కెక్కించేలా చేసిన సినిమా అనోరాకు ఆస్కార్ అవార్డు(Oscar Awards) రావ‌డం ఏమిటి అంటూ గూగుల్ లో, ఇత‌ర మాధ్య‌మాల‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అస‌లు ఈ చిత్రంలో ఏముంది..ఎందుకింతగా జ‌నాన్ని ఆక‌ట్టుకునేలా చేసింది. ఒక‌టా రెండా ఏకంగా ప్ర‌పంచ స్థాయి ఆస్కార్ అవార్డుల‌ను ఐదింటిని స్వంతం చేసుకుంది ఈ మూవీ. ఇది ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Oscar Awards 2025 Updates

అనోరాలో వేశ్య‌గా న‌టించిన  న‌టికి ఉత్త‌మ న‌టి పుర‌స్కారం ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా ఆమె క‌న్నీటి ప‌ర్యంతానికి లోనైంది. ఇది త‌న జీవితంలో మ‌రిచి పోలేని స‌న్నివేశంగా ఎల్ల‌కాలం గుర్తుండి పోతుంద‌ని పేర్కొంది. అత్యున్న‌త‌మైన ఆస్కార్ అవార్డు ద‌క్క‌డంతో అనోరాను చూసేందుకు ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు. దీంతో ఆయా ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ ల‌ను వెత‌క‌డం ప్రారంభించారు.

అనోరా చిత్రానికి ఉత్త‌మ చిత్రం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే , ఉత్త‌మ ద‌ర్శ‌కుడి అవార్డులు ద‌క్కాయి. ద‌ర్శ‌కుడు సీన్ బేక‌ర్ అద్భుత‌మైన ర‌చ‌యిత‌గా గుర్తింపు పొందాడు. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ వైడ్ గా అనోరా ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది.  ఈ మూవీని రొమాంటిక్ , కామెడీ, డ్రామా జాన‌ర్ లో తీసేందుకు ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో 23 ఏళ్ల అని అనే వేశ్య చుట్టూ క‌థ తిరుగుతుంది. ర‌ష్య‌న్ కు చెందిన యువ‌కుడు త‌న‌ను పెళ్లి చేసుకుంటాడు.

ధ‌న‌వంతుల కుమారుడు పెళ్లి చేసుకోవ‌డం చ‌ర్చ‌కు దారి తీస్తుంది. త‌మ కొడుకును వ‌దిలేస్తే 10 వేల డాల‌ర్లు ఇస్తామ‌ని ఆశ చూపిస్తారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందనేది తెలుసు కోవాలంటే అనోరా చూడాల్సిందే.  దీనిని రూ. 52 కోట్లు పెట్టి తీస్తే రూ. 352 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీప్ల‌స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : Kingston Sensational :జీవీ ప్ర‌కాష్ ‘కింగ్‌స్టన్‌’ సెన్సేష‌న్

2025Oscar AwardsTrendingUpdates
Comments (0)
Add Comment