Oscar 2025 : అమెరికా వేదికగా ఆస్కార్ 2025 అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతోంది. ఉత్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ , ఉత్తమ నటిగా మైకీ మాడిసన్ ఆస్కార్ అవార్డు గెలుపొందారు. కాగా టిమోతీ చాలమెట్, సెబాస్టియన్ స్టాన్, కోల్మన్ డొమింగో, రాల్ఫ్ ఫియన్నెస్ వంటి ప్రతిభావంతులైన నామినీల బృందంతో బ్రాడీ పోటీ పడ్డారు. చివరకు విజేతగా నిలిచారు.
Oscar 2025 Actor and Actress
2025 అకాడమీ అవార్డులలో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును అడ్రియన్ గెలుచుకున్నాడు, ఎ కంప్లీట్ అన్‌నోన్ చిత్రానికి టిమోతీ చాలమెట్, ది అప్రెంటిస్ చిత్రానికి సెబాస్టియన్ స్టాన్, సింగ్ సింగ్ చిత్రానికి కోల్మన్ డొమింగో, కాన్‌క్లేవ్ చిత్రానికి రాల్ఫ్ ఫియన్నెస్ వంటి ప్రతిభావంతులైన నామినీల బృందాన్ని కాదని తను గెలుపొందాడు.
మరోవైపు, అనోరాలో తన పాత్రకు మికీ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది, వికెడ్ కోసం సింథియా ఎరివో, ఎమిలియా పెరెజ్‌లో తన పాత్రకు కార్లా సోఫియా గాస్కాన్, ది సబ్‌స్టాన్స్ కోసం డెమి మూర్ఐ , యామ్ స్టిల్ హియర్ కోసం ఫెర్నాండా టోర్రెస్ వంటి బలమైన పోటీదారులను ఓడించింది.
Also Read : Sandeep Reddy Shocking :నేను ఒత్తిడిని పట్టించుకోను – వంగా