Oppenheimer: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఓపెన్‌హైమర్(Oppenheimer)’. అణుబాంబు సృష్టికర్త డా జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా… గతేడాది జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హాలీవుడ్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. కేవలం 100 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది. ‘ఓపెన్ హైమర్’ సినిమా… ఏడు విభాగాల్లో తన సత్తా చాటింది. ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్, ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీలు పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫి, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ నేపథ్య సంగీతం విభాగాల్లోనూ ఈ సినిమా అవార్డులు గెలుచుకుంది.
లాస్ ఏంజెలీస్ లోని డాల్బీ థియేటర్ వేదికగా నిర్వహించిన 96వ ఆస్కార్ వేడుకల్లో మొత్తం పదమూడు నామినేషన్లు దక్కించుకున్న ‘ఓపెన్‌హైమర్’… ఉత్తమ చిత్రంతో పాటు దర్శకుడు, నటుడు, సహాయనటుడు, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్ మొత్తం ఏడు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.
Oppenheimer – ‘ఓపెన్‌హైమర్’ సాధించిన ఆస్కార్ అవార్డులు ఇవే
ఉత్తమ చిత్రం: (ఓపెన్ హైమర్)
ఉత్తమ దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ నటుడు: సిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: హోయ్‌టే వాన్ హోయ్‌టెమా (ఓపెన్ హైమర్)
ఉత్తమ ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ (ఓపెన్ హైమర్)
ఉత్తమ ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: లూడ్వింగ్ గొరాన్సన్ (ఓపెన్‌హైమర్)
Also Read : Shaitaan: 50 కోట్ల క్లబ్ లోకి అజయ్ దేవగణ్ “సైతాన్” !