Aha-Omkar show trend : ఆహాలో ఓంకార్ డాన్స్ ఐకాన్ -2 షో

త్వ‌ర‌లో స్ట్రీమింగ్ కానుంద‌ని ప్ర‌క‌ట‌న

Omkar : ఓ వైపు సినిమాలు మ‌రో వైపు ఓటీటీలు పోటీ ప‌డుతున్నాయి. ఇప్పుడు వెబ్ సీరీస్ ల కాలం న‌డుస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ , శాండిల్ వుడ్ ల‌కు ధీటుగా ఓటీటీలు డిఫ‌రెంట్ ప్రోగ్రామ్స్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

Omkar Dance Ikon 2

తాజాగా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సైతం ఓటీటీల హ‌వా న‌డుస్తోంది. అల్లు అర‌వింద్ కు చెందిన ఆహా సంస్థ ఇప్పుడు టాప్ లో కొన‌సాగుతోంది. భారీ ఎత్తున ఖర్చు చేస్తోంది వెబ్ సీరీస్, ఇత‌ర ప్రోగ్రామ్స్ కోసం.

తాజాగా మ‌రో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది ఆహా. ఈ మేర‌కు ప్ర‌ముఖ ప్ర‌యోక్త ఓంకార్(Omkar) నేతృత్వంలో ఐకాన్ 2 పేరుతో డ్యాన్స్ షో రెడీ అయ్యింది. త్వ‌ర‌లోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంద‌ని ప్ర‌క‌టించింది. అధికారికంగా వెల్ల‌డించింది.

ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా థియేట‌ర్ల కంటే ఓటీటీల‌నే ఆశ్ర‌యిస్తున్నారు. వీలున్న‌ప్పుడు చూసుకునేందుకు స‌మ‌యం చిక్క‌డంతో దీనికే ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ఆహా ముందంజ‌లో కొన‌సాగుతోంది. పేరొందిన మూవీస్, క్రీడా పోటీలు, టాక్ షోలు, వెబ్ సీరీస్ ను స్ట్రీమింగ్ చేస్తోంది.

ఆహాలో టాప్ లో కొన‌సాగుతోంది నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య నిర్వ‌హిస్తున్న స్పెష‌ల్ షో అన్ స్టాప‌బుల్ ప్రోగ్రాం. ఇండియాలోనే అత్యంత జ‌నాద‌ర‌ణ కలిగిన కార్య‌క్ర‌మంగా నిలిచింది. గ‌తంలో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన డ్యాన్స‌ర్ల కోసం ప్ర‌త్యేకంగా డాన్స్ ఐకాన్ షోను చేప‌ట్టింది. తాజాగా దీనికి కొన‌సాగింపుగా డాన్స్ ఐకాన్ 2కు ప్లాన్ చేసింది.

Also Read : Hero Rishab Shetty : రిష‌బ్ శెట్టి న్యూ లుక్ కెవ్వు కేక 

ahaOTTTrendingUpdates
Comments (0)
Add Comment