Om Shivam Movie : ఓ శివ భక్తుడి జీవిత కథగా వస్తున్న ‘ఓం శివమ్’ సినిమా

నిర్మాత కె. ఎన్. కృష్ణ మాట్లాడుతూ....

Om Shivam : భార్గవ కృష్ణ హీరోగా పరిచయం చేస్తూ.. దీపా మూవీస్ బ్యానర్‌పై కె. ఎన్. కృష్ణ. కనకపుర నిర్మాతగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ఓం శివం. ఈ సినిమాలో విరానిక శెట్టి(Viranika ShettyViranika Shetty) కథానాయికగా న‌టిస్తుండ‌గా ఆల్విన్ దర్శకత్వం చేస్తున్నారు. ఈస్ట్ గోదావరి, మాండ్య, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ‌ జరుపుకుంది. తాజాగా ఈ మూవీ గురించి మేక‌ర్స్ అప్డేట్ ఇచ్చారు. వైరాగ్యంలో ఉన్న ఓ శివ భక్తుడి జీవితంలో జరిగే కొన్ని అనూహ్య సంఘటనలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఓం శివం చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని తెలిపారు. దర్శకుడు ఆల్విన్ మాట్లాడుతూ.. హీరో భార్గవ కృష్ణకి ఇది మొదటి సినిమా అయినా చాలా బాగా న‌టిస్తున్నాడ‌ని, అదేవిధంగా చిత్ర‌ కథ, సంగీతం, కెమెరా వ‌ర్క్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయ‌ని అన్నారు.

Om Shivam Movie Updates

నిర్మాత కె. ఎన్. కృష్ణ మాట్లాడుతూ.. కథ వినగానే అన్ని భాషలలో చేద్దాం అని దర్శకుడికి చెప్పానని, ప్లానింగ్ ప్రకారం బడ్జెట్ వృధా చెయ్యకుండా ఆల్విన్ సినిమాను బాగా తీశాడ‌న్నారు. ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా మూడు భాషల పాటలను త్వరలో విడుదల చేస్తామ‌ని, మరో రెండు నెలలలో ఒకేరోజు మూడు భాషల్లో చిత్రాన్ని విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read : Pushpa 2 Update : పుష్ప 2 నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

New MoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment