OG Glimpse : ఓజీ గ్లింప్స్ గూస్ బంప్స్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ

OG Glimpse : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా త‌ను న‌టించిన ఓజీ మూవీకి సంబంధించి మూవీ మేక‌ర్స్ గ్లింప్స్ విడుద‌ల చేశారు. ఉజిత్ క‌థ అందించ‌గా సుజిత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో ప‌వ‌న్ తో పాటు ఇమ్రాన్ హ‌స్మీ, ప్ర‌కాశ్ రాజ్ , ఓజ‌స్ గంభీర‌, ప్రియాంక అరుళ్ మోహ‌న్ , అర్జున్ దాస్ , శ్రేయ రెడ్డి, హ‌రీష్ ఉత్త‌మ‌న్ , షామ్ న‌టిస్తున్నారు.

OG Glimpse Released

ఇక ఓజీ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా శ‌నివారం రిలీజ్ చేసిన ఓజీ గ్లింప్స్(OG Glimpse) గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ప్ర‌త్యేకించి ప‌వ‌ర్ స్టార్ లోని స్టామినా ఏపాటిదో ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు సుజీత్.

భారీ బ‌డ్జెట్ తో దీనిని రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే ఓజీ ఎలా ఉండ‌బోతోందంటూ ఉత్కంఠ కు లోనైన ఫ్యాన్స్ కు తీపి క‌బురు చెప్పాడు డైరెక్ట‌ర్. ఇవాళ విడుద‌లైన ఓజీ గ్లింప్స్ మ‌రింత ఆక‌ట్టుకునేలా ఉంది. ప్ర‌త్యేకించి అన్ని వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేసేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు సుజీత్. ఇక ఎప్ప‌టి లాగే న‌ట‌న‌లో త‌న‌కంటూ ఎదురే లేద‌ని నిరూపించాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

స‌రైన ద‌ర్శ‌కుడు గ‌నుక తోడైతే ప‌వ‌ర్ స్టార్ ను ఓ రేంజ్ లో తీసుకు వెళ్ల‌వ‌చ్చ‌ని ఓజీని చూస్తే తెలుస్తుంది.

Also Read : Pawan Kalyan : ప‌వ‌న్ కు బాబు బ‌ర్త్ డే విషెస్

Comments (0)
Add Comment