Odela 2 : ఈ ఏడాది పలు సినిమాలు విడుదల కాగా కొన్ని మాత్రమే ఆశించిన మేర సక్సెస్ టాక్ ను అందుకున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో స్టార్ డమ్ ను జనం పట్టించు కోలేదు. చిన్న సినిమాలని అనుకున్న డ్రాగన్, కోర్ట్ చిత్రాలు భారీ విజయాన్ని నమోదు చేశాయి. బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కాసుల వర్షం కురిపించాయి. ఇదే సమయంలో సంక్రాంతి పర్వదినం సందర్బంగా విడుదలైన భారీ చిత్రాలలో రెండు మాత్రమే సూపర్ హిట్ కాగా మరోటి డిజాస్టర్ గా నిలిచింది.
Tamannaah Odela 2 Movie Updates
నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజ్ రూ. 130 కోట్లు సాధించగా అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక తక్కువ బడ్జెట్ తో నాని తీసిన కోర్టు ఓటీటీ రైట్స్ రూ. 8 కోట్లకు అమ్ముడు పోయింది. ఇదే సమయంలో మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ నటించిన గేమ్ ఛేంజర్ బోల్తా పడింది. ప్రస్తుతం తను బుచ్చిబాబు సనతో పెద్ది మూవీలో నటిస్తున్నాడు.
ఇదే ఇయర్ లో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో అజిత్ నటించిన విదాముయార్చి ఫెయిల్ కాగా త్రిష కృష్ణన్ తో కలిసి నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, పృత్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించి నటించిన లూషిఫర్ సీక్వెల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా మరో రెండు భారీ సినిమాలు విడుదలయ్యేందుకు సిద్దమయ్యాయి.
ఆ రెండు సినిమాలు చూస్తే ఒకటి తమన్నా భాటియా సాధువుగా నటించిన ఓదెల 2(Odela 2) కాగా మరోటి కళ్యాణ్ రామ్, విజయశాంతి నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun s/o Vyjayanthi). ఇవి ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్నాయని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ రెండింటికి సంబంధించిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్స్ కెవ్వు కేక అనేలా ఉన్నాయి. దీంతో ఓదెల2 ఆకట్టుకుంటుందా లేక అర్జున్ పై చేయి సాధిస్తాడా అన్నది వేచి చూడాలి.
Also Read : Hero Mahesh-Rajamouli SSMB29 :మూడో షెడ్యూల్ కోసం జక్కన్న..ప్రిన్స్ సిద్ధం