Hero Sunny Deol-Jaat :ఓ రామ శ్రీ‌రామ ‘జాట్’ సాంగ్ రిలీజ్

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో

Jaat : ద‌మ్మున్న డైరెక్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని దర్శ‌క‌త్వంలో స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ జాట్(Jaat). ఇందులో స్టార్ హీరో స‌న్నీ డియోల్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవ‌లే సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. టేకింగ్, మేకింగ్ లో ద‌మ్మున్నోడిగా గుర్తింపు పొందాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌త్యేకించి హీరోను డిఫ‌రెంట్ గా చూపించ‌డంలో త‌న‌కు త‌నే సాటి. మాస్ మ‌హారాజాతో బ‌లుపు తీశాడు. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో వీర సింహారెడ్డి తీశాడు. మంచి స‌క్సెస్ అందుకుంది.

Sunny Deol Jaat Movie Updates

హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్పేస్ క‌లిగిన న‌టుడు స‌న్నీ డియోల్(Sunny Deol). త‌న బాడీ లాంగ్వేజ్ కు త‌గిన‌ట్టుగా డిఫ‌రెంట్ గా తెర‌కెక్కించాడు జాట్ చిత్రాన్ని. ఈ మూవీ ట్రైల‌ర్ లో ఆక‌ట్టుకునేలా డైలాగులు, యాక్ష‌న్ స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. జాట్ ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందుకు సంబంధించి మూవీ మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ పై ఫోక‌స్ పెట్టారు.

ఇక జాట్ లో స‌న్నీ డియోల్ తో పాటు రెజీనా కాసాండ్రా, న‌యామీ ఖేర్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌డం విశేషం. ఇక మ‌రో హీరో ర‌ణ దీప్ హూడా ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తున్నాడు. త‌ను దావూద్ ఇబ్ర‌హీం మాఫియా నేప‌థ్యంలో ఆ మ‌ధ్య‌న డిలో న‌టించాడు. ఇది దేశ వ్యాప్తంగా సెన్సేష‌న్ సృష్టించింది. తాజాగా జాట్ సినిమాలోని ఓరామ శ్రీ‌రామ అనే పాట‌ను విడుద‌ల చేశారు.

Also Read : Hero Ram Charan-Peddi :రిలీజ్ కాకుండానే ‘పెద్ది’ సెన్సేష‌న్

CinemaJaatSunny DeolTrendingUpdates
Comments (0)
Add Comment