Devara Trailer : నెట్టింట తెగ వైరల్ అవుతున్న తారక్ ‘దేవర’ ట్రైలర్

తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది...

Devara: మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ఓ రేంజ్ ఎక్స్‏పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ వంటి సంచలనం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు అభిమానులు. డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేవర(Devara) ఫస్ట్ పార్ట్ ను ఈనెల 27న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ మూవీ పై ఆసక్తిని పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంటి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. చాలా కాలం తర్వాత పూర్తిగా ఊర్ మాస్ లుక్‏లో యాక్షన్ అదరగొట్టేశాడు తారక్.

Devara Trailer Updates

తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో తారక్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయనున్నట్లు ట్రైలర్ తో తెలియజేశారు. అఇక ఇందులో ఎన్టీఆర్ నటన, డైలాగ్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. తారక్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన మూడు పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అదరగొట్టేశాడు అనిరుధ్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ కె, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

Also Read : Hero Prabhas : భారీ వేగంతో దూసుకుపోతున్న డార్లింగ్ ‘రాజా సాబ్’

CinemaDevaraTrailer releaseTrendingUpdateViral
Comments (0)
Add Comment